Samgadim goosumda nee sarivaaramaa

సంగడిఁ గూచుండ నీ సరివారమా
Language

(॥పల్లవి॥)
సంగడిఁ గూచుండ నీ సరివారమా
చెంగట నున్నాఁడవు నీ చిత్తమింతేకాక

(॥సంగ॥)
కాంతలము నేము నీతో కాఁతాళించేవారమా
పంతములిచ్చిన మీఁదఁ బగలేఁటికి
కొంతపుఁ జూపుల జూచి గోలదాన నేమిసేసే
రంతుల విభుఁడవు నీరపమింతేకాక

(॥సంగ॥)
కోమలుల మిటు నిన్ను కొసరేటివారమా
చేముట్టి మొక్కిన మీద సిగ్గులేఁటికి
మోము వంచుకొని నిన్ను ముద్దరాల నేమి సేసే
కోమలపువాఁడవు నీగుణ మింతే కాక

(॥సంగ॥)
వనితల మిటు నిన్ను వడిఁబెట్టేవారమా
చనవు చేకొన్నమీఁద సడియేఁటికి
యెనసితివి శ్రీ వేంకటేశ నన్నింతటిలోనె
ఘనుఁడవు నీ వలపు కడు మించెఁగాక

(||pallavi||)
saṁgaḍim̐ gūsuṁḍa nī sarivāramā
sĕṁgaḍa nunnām̐ḍavu nī sittamiṁtegāga

(||saṁga||)
kāṁtalamu nemu nīdo kām̐tāḽiṁchevāramā
paṁtamulichchina mīm̐dam̐ bagalem̐ṭigi
kŏṁtabum̐ jūbula jūsi goladāna nemisese
raṁtula vibhum̐ḍavu nīrabamiṁtegāga

(||saṁga||)
komalula miḍu ninnu kŏsareḍivāramā
semuṭṭi mŏkkina mīda siggulem̐ṭigi
momu vaṁchugŏni ninnu muddarāla nemi sese
komalabuvām̐ḍavu nīguṇa miṁte kāga

(||saṁga||)
vanidala miḍu ninnu vaḍim̐bĕṭṭevāramā
sanavu segŏnnamīm̐da saḍiyem̐ṭigi
yĕnasidivi śhrī veṁkaḍeśha nanniṁtaḍilonĕ
ghanum̐ḍavu nī valabu kaḍu miṁchĕm̐gāga