(॥పల్లవి॥)
సంగడిజాణతనాల సటకాడ
అంగడివలపు చల్లే వడ్డమాడ నోపరా
(॥సంగ॥)
కన్నులచే నవ్వినవ్వి కడుఁగొప్పు దువ్విదువ్వి
వెన్నెలమాయలు సేయ వస్తివా వోరి
చన్ను లంటకుమీయంటే చాఁచేవు మానానకు
ఇన్నేసి నేరకుండితే నెట్టు బతికేవురా
(॥సంగ॥)
చెక్కులిటు నొక్కి నొక్కి చేతులు వేసివేసి
మక్కువనీచేతఁ లిందు మాపేవా వోరి
తొక్కకుమీ పాదమంటే దొరసె వావి యనేవు
యెక్కవమాఁటలు దయ్య మిచ్చేఁగా వోరి
(॥సంగ॥)
పానువుపైఁ జేరిచేరి పైఁ గొంగు వేసి వేసి
పూనిన కళలు రేఁచి పొందేవా వోరి
మోనాన నే నుండమంటే మొక్కుమొక్కికూడితివి
కానీలే శ్రీవేంకటేశ కైవసమైతివిరా
(||pallavi||)
saṁgaḍijāṇadanāla saḍagāḍa
aṁgaḍivalabu salle vaḍḍamāḍa nobarā
(||saṁga||)
kannulase navvinavvi kaḍum̐gŏppu duvviduvvi
vĕnnĕlamāyalu seya vastivā vori
sannu laṁṭagumīyaṁṭe sām̐sevu mānānagu
innesi neraguṁḍide nĕṭṭu badigevurā
(||saṁga||)
sĕkkuliḍu nŏkki nŏkki sedulu vesivesi
makkuvanīsedam̐ liṁdu mābevā vori
tŏkkagumī pādamaṁṭe dŏrasĕ vāvi yanevu
yĕkkavamām̐ṭalu dayya michchem̐gā vori
(||saṁga||)
pānuvubaim̐ jeriseri paim̐ gŏṁgu vesi vesi
pūnina kaḽalu rem̐si pŏṁdevā vori
monāna ne nuṁḍamaṁṭe mŏkkumŏkkigūḍidivi
kānīle śhrīveṁkaḍeśha kaivasamaidivirā