సంగడికి రాఁగదవే సరిచూచేను
(॥పల్లవి॥)
సంగడికి రాఁగదవే సరిచూచేను
యింగిత మెరుఁగుకొంటే నిద్దరికిఁ గూడెను
(॥॥)
తుంమిదలు వ్రాయఁబోతే తొయ్యలి నీతురుమాయ
నెమ్మిఁ జందురు వాఁసితే నీమోమాయనే
వుమ్మడి సంపెంగ వ్రాయ నున్నతి నాసికమాయ
కమ్మఁగలువలు వ్రాయఁ గన్నులాయను
(॥॥)
గక్కన శంఖము వ్రాయఁ గన్నెరో నీగళమాయ
జక్కవల వ్రాయఁగా నీచన్నులాయను
అక్కరఁ దామరలు వ్రాయఁగ నీకరములాయ
నిక్కి సింహము వ్రాయఁగా నీనడుమాయను
(॥॥)
పులిసము వ్రాయఁగాను పొలఁతి నీపిరుఁదాయ
తెలియ నరఁటులు వ్రాసితేఁ దొడలాయ
కలసితివి శ్రీవేంకటేశ్వరుఁడనుఁ దాను
బలుచిగురులు వ్రాయఁ బాదాలాయను
(||pallavi||)
saṁgaḍigi rām̐gadave sarisūsenu
yiṁgida mĕrum̐gugŏṁṭe niddarigim̐ gūḍĕnu
(||||)
tuṁmidalu vrāyam̐bode tŏyyali nīdurumāya
nĕmmim̐ jaṁduru vām̐side nīmomāyane
vummaḍi saṁpĕṁga vrāya nunnadi nāsigamāya
kammam̐galuvalu vrāyam̐ gannulāyanu
(||||)
gakkana śhaṁkhamu vrāyam̐ gannĕro nīgaḽamāya
jakkavala vrāyam̐gā nīsannulāyanu
akkaram̐ dāmaralu vrāyam̐ga nīgaramulāya
nikki siṁhamu vrāyam̐gā nīnaḍumāyanu
(||||)
pulisamu vrāyam̐gānu pŏlam̐ti nībirum̐dāya
tĕliya naram̐ṭulu vrāsidem̐ dŏḍalāya
kalasidivi śhrīveṁkaḍeśhvarum̐ḍanum̐ dānu
balusigurulu vrāyam̐ bādālāyanu