Samgadi yeṟamgavaddaa jaanagaamdavu

సంగతి యెఱఁగవద్దా జాణకాఁడవు
Language

(॥పల్లవి॥)
సంగతి యెఱఁగవద్దా జాణకాఁడవు
అంగడి వేతురా మోహ మాసోదకాడవు

(॥సంగ॥)
చెక్కు చేత నిడుకొని సిగ్గున నవ్వేచెలిఁ
బక్కన నేల పట్టేవు పంతఁగాడవు
చిక్కనిచెమటతోడ చేతులెత్తి మొక్కేయాపె-
నిక్కువ లంటుదురా యింతవాఁడవు

(॥సంగ॥)
అడరి తెరమాటున నానలువెట్టేఇంతిఁ
దొడికి పట్టుదురా దొరవాఁడవు
వొడఁబాటు మాటల నే వొద్దనే లోనైవుండఁగా
పుడుకుదురా చన్నులు బూములేలేవాఁడవు

(॥సంగ॥)
అంగవించి నీసేత కడ్డమాడనిసతిని
యెంగిలిసేతురా మోవి ఇంపూవాఁడవు
రంగు శ్రీవేంకటేశ రతి నెనసి చొక్కించి
పంగింతురా యింతలోనే బలువాఁడవు

(||pallavi||)
saṁgadi yĕṟam̐gavaddā jāṇagām̐ḍavu
aṁgaḍi vedurā moha māsodagāḍavu

(||saṁga||)
sĕkku seda niḍugŏni sigguna navvesĕlim̐
bakkana nela paṭṭevu paṁtam̐gāḍavu
sikkanisĕmaḍadoḍa sedulĕtti mŏkkeyābĕ-
nikkuva laṁṭudurā yiṁtavām̐ḍavu

(||saṁga||)
aḍari tĕramāḍuna nānaluvĕṭṭeiṁtim̐
dŏḍigi paṭṭudurā dŏravām̐ḍavu
vŏḍam̐bāḍu māḍala ne vŏddane lonaivuṁḍam̐gā
puḍugudurā sannulu būmulelevām̐ḍavu

(||saṁga||)
aṁgaviṁchi nīseda kaḍḍamāḍanisadini
yĕṁgilisedurā movi iṁpūvām̐ḍavu
raṁgu śhrīveṁkaḍeśha radi nĕnasi sŏkkiṁchi
paṁgiṁturā yiṁtalone baluvām̐ḍavu