Samgadeṟamgavaddaa jaanalagunu

సంగతెఱఁగవద్దా జాణలకును
Language

(॥పల్లవి॥)
సంగతెఱఁగవద్దా జాణలకును
చెంగట నొకరిచేత చెప్పించుకోనేఁటికి

(॥సంగ॥)
చేయెత్తి మొక్కఁగఁబోయి సిగ్గువడీఁ జెలియ
చాయల పయ్యదకొంగు జారీనంటాను
వేయరాదా తెర నీవు వెలఁదిసిబ్బితి వాయ
పాయపుమదాన నింత పచ్చిసేయనేఁటికి

(॥సంగ॥)
వూడిగాలు చేయఁజూచి వొగ్గి కొంకీఁ జెలియ
వేడుకతో పోఁకముడి వీడీనంటాను
మేడలోని కేఁగరాదా మెలుఁతవెరపు దీర
కోడెతనమున వింత గోరసేయనేఁటికి

(॥సంగ॥)
చేవట్టి తియ్యఁగఁబోయి చింతించీఁ జెలియ
పూవులకొప్పు వదలిపొరలీనంటా
వోవరిలోఁ గూడరాదా వువిద సంతసించఁగ
శ్రీవేంకటేశుఁడ ఇంత చిమ్మిరేఁచనేఁటికి

(||pallavi||)
saṁgadĕṟam̐gavaddā jāṇalagunu
sĕṁgaḍa nŏgariseda sĕppiṁchugonem̐ṭigi

(||saṁga||)
seyĕtti mŏkkam̐gam̐boyi sigguvaḍīm̐ jĕliya
sāyala payyadagŏṁgu jārīnaṁṭānu
veyarādā tĕra nīvu vĕlam̐disibbidi vāya
pāyabumadāna niṁta pachchiseyanem̐ṭigi

(||saṁga||)
vūḍigālu seyam̐jūsi vŏggi kŏṁkīm̐ jĕliya
veḍugado pom̐kamuḍi vīḍīnaṁṭānu
meḍaloni kem̐garādā mĕlum̐tavĕrabu dīra
koḍĕdanamuna viṁta goraseyanem̐ṭigi

(||saṁga||)
sevaṭṭi tiyyam̐gam̐boyi siṁtiṁchīm̐ jĕliya
pūvulagŏppu vadalibŏralīnaṁṭā
vovarilom̐ gūḍarādā vuvida saṁtasiṁcham̐ga
śhrīveṁkaḍeśhum̐ḍa iṁta simmirem̐sanem̐ṭigi