సందుసుడికత్తెవు జాణవు నీవు
(॥పల్లవి॥)
సందుసుడికత్తెవు జాణవు నీవు
యిందరు నుండఁగా నీ వెంత లాచేవే
(॥సందు॥)
వుంగరము నీదంటా వూరకే వేలువట్టేవు
కొంగు దాఁకించకుమంటా కోరఁ జిమ్మేవు
సింగారించనేర్తునంటా చేరి వద్దఁ గూచుండేవు
ఇంగితము చూపి పతి కెంతలాచేవే
(॥సందు)
మన్నము వెట్టుమంటా చుట్టరికాలు సేసేవు
వున్నదా నిమ్మపండంటా నొడివట్టేవు
చన్నులు చూచితిలంటా సారెఁ దగులనాడేవు
యెన్నికతో రతులకు నెంతలాచేవే
(॥సందు॥)
కోవిల గూసీనంటా కుచ్చి కాఁగిలించేవు
దేవులనైతినంటాఁ దెరవేసేవు
చేవమీర నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు
యీవేళ నీవాసపడి యెంతలాచేవే
(||pallavi||)
saṁdusuḍigattĕvu jāṇavu nīvu
yiṁdaru nuṁḍam̐gā nī vĕṁta lāseve
(||saṁdu||)
vuṁgaramu nīdaṁṭā vūrage veluvaṭṭevu
kŏṁgu dām̐kiṁchagumaṁṭā koram̐ jimmevu
siṁgāriṁchanerdunaṁṭā seri vaddam̐ gūsuṁḍevu
iṁgidamu sūbi padi kĕṁtalāseve
(||saṁdu)
mannamu vĕṭṭumaṁṭā suṭṭarigālu sesevu
vunnadā nimmabaṁḍaṁṭā nŏḍivaṭṭevu
sannulu sūsidilaṁṭā sārĕm̐ dagulanāḍevu
yĕnnigado radulagu nĕṁtalāseve
(||saṁdu||)
kovila gūsīnaṁṭā kuchchi kām̐giliṁchevu
devulanaidinaṁṭām̐ dĕravesevu
sevamīra nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
yīveḽa nīvāsabaḍi yĕṁtalāseve