సందుసుడికత్తెల జాణతనా లిట్టివౌనె
(॥పల్లవి॥)
సందుసుడికత్తెల జాణతనా లిట్టివౌనె
పొందులేని పొందులేల పొదువ వచ్చేవే
(॥॥)
బట్టబయలాతఁడు నీబావంటా నందరితో
చుట్టరికా లంతేసి చూపి చెప్పేవే
మెట్టిపట్టు కప్పటి నీమేనత్తకొడుకంటాను
జట్టిగొని యాతనితో సరసాలాడేవే
(॥॥)
బెరసి యాతఁడు నీపెండ్లి కొడుకవునంటా
సొరిదిఁ గంకణ మెట్టు చూపవచ్చేవే
గరిమ నాతఁడు నికాలు దొక్కినాఁడంటా
పరువుపై నింటిలోనఁ బవళించేవే
(॥॥)
వూరకె యిప్పుడు నీవొడివట్టె నీతఁడంటా
నోరమాటలాడి చన్నుల నొత్తేవే
యీరీతి శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
నారమణుఁడేలె నన్ను నవ్వులేల నవ్వేవే
(||pallavi||)
saṁdusuḍigattĕla jāṇadanā liṭṭivaunĕ
pŏṁduleni pŏṁdulela pŏduva vachcheve
(||||)
baṭṭabayalādam̐ḍu nībāvaṁṭā naṁdarido
suṭṭarigā laṁtesi sūbi sĕppeve
mĕṭṭibaṭṭu kappaḍi nīmenattagŏḍugaṁṭānu
jaṭṭigŏni yādanido sarasālāḍeve
(||||)
bĕrasi yādam̐ḍu nībĕṁḍli kŏḍugavunaṁṭā
sŏridim̐ gaṁkaṇa mĕṭṭu sūbavachcheve
garima nādam̐ḍu nigālu dŏkkinām̐ḍaṁṭā
paruvubai niṁṭilonam̐ bavaḽiṁcheve
(||||)
vūragĕ yippuḍu nīvŏḍivaṭṭĕ nīdam̐ḍaṁṭā
noramāḍalāḍi sannula nŏtteve
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
nāramaṇum̐ḍelĕ nannu navvulela navveve