సందుసుడిదానఁ గాను సతమైనదాన నీకు
(॥పల్లవి॥)
సందుసుడిదానఁ గాను సతమైనదాన నీకు
అందరివలెనే నన్ను నలయించ కిఁకను
(॥॥)
వొత్తి నీకు విన్నవించే పూఁకొని విను నామాట
చిత్తమువచ్చినప్పుడు సేతువుగాని
బత్తిగల వెరుఁగుదు పఱమారు నారతులు
చిత్తగించి యాపెతోడఁ జెప్పకు నీవిఁకను
(॥॥)
కనుఁగొన నీకు మొక్కే కానుకగాఁజేకొను
పనిగలప్పుడు చేపట్టేవుగాని
చనవిచ్చితివి తొల్లి సరసపునాచేఁతలు
సొరిది నాపెముందరఁజూపకు నీవిఁకను
(॥॥)
తతి నాచన్నులనొత్తేతనివొంది కాఁగిలించు
యితవై నప్పు డింకా నేలేవుగాని
పతివి శ్రీ వేంకటేశ పచ్చయిననాసుద్దులు
నతమాయ నా పెతో పచారించకు మిఁకను
(||pallavi||)
saṁdusuḍidānam̐ gānu sadamainadāna nīgu
aṁdarivalĕne nannu nalayiṁcha kim̐kanu
(||||)
vŏtti nīgu vinnaviṁche pūm̐kŏni vinu nāmāḍa
sittamuvachchinappuḍu seduvugāni
battigala vĕrum̐gudu paṟamāru nāradulu
sittagiṁchi yābĕdoḍam̐ jĕppagu nīvim̐kanu
(||||)
kanum̐gŏna nīgu mŏkke kānugagām̐jegŏnu
panigalappuḍu sebaṭṭevugāni
sanavichchidivi tŏlli sarasabunāsem̐talu
sŏridi nābĕmuṁdaram̐jūbagu nīvim̐kanu
(||||)
tadi nāsannulanŏttedanivŏṁdi kām̐giliṁchu
yidavai nappu ḍiṁkā nelevugāni
padivi śhrī veṁkaḍeśha pachchayinanāsuddulu
nadamāya nā pĕdo pasāriṁchagu mim̐kanu