Samdusudi vanidavu jaanavammaa

సందుసుడి వనితవు జాణవమ్మా
Language

(॥పల్లవి॥)
సందుసుడి వనితవు జాణవమ్మా
అందుకోలు పెండ్లాడే వౌనమ్మా

(॥॥)
కాతరాన రమణుఁడేకతమున నుండఁగాను
ఆతనిపై బత్తి నేనే వౌనమ్మా
యీతల నెవ్వతెకో తా నెదురులు చూడఁగాను
చేతు లెత్తి మొక్కేవు చేరీ మేలు నమ్మా

(॥॥)
వేడుకతో నేమిటికో వీను లాలకించఁగాను
ఆడేవు నీమాటలు అవునమ్మా
జాడతోనే అడపముసతుల వెదకఁగాను
వీడెము నీ విచ్చేవు విటకత్తె వమ్మా

(॥॥)
యింటిలో యలమేల్మంగ నెదఁబెట్టు కుండఁగాను
అంటేవు శ్రీ వేంకటేశు నౌనమ్మా
జంటలై యీతఁడే మమ్ము సరి నేలుకుండఁగాను
నంటున నీవు మెచ్చేవు నయగారివమ్మా

(||pallavi||)
saṁdusuḍi vanidavu jāṇavammā
aṁdugolu pĕṁḍlāḍe vaunammā

(||||)
kādarāna ramaṇum̐ḍegadamuna nuṁḍam̐gānu
ādanibai batti nene vaunammā
yīdala nĕvvadĕgo tā nĕdurulu sūḍam̐gānu
sedu lĕtti mŏkkevu serī melu nammā

(||||)
veḍugado nemiḍigo vīnu lālagiṁcham̐gānu
āḍevu nīmāḍalu avunammā
jāḍadone aḍabamusadula vĕdagam̐gānu
vīḍĕmu nī vichchevu viḍagattĕ vammā

(||||)
yiṁṭilo yalamelmaṁga nĕdam̐bĕṭṭu kuṁḍam̐gānu
aṁṭevu śhrī veṁkaḍeśhu naunammā
jaṁṭalai yīdam̐ḍe mammu sari neluguṁḍam̐gānu
naṁṭuna nīvu mĕchchevu nayagārivammā