సందుసుడి నేమికి సరి నింత సేసేవు
(॥పల్లవి॥)
సందుసుడి నేమికి సరి నింత సేసేవు
కందువకు రాఁగా బింకము చూపరాదా
(॥సందు॥)
చిత్తరువువా(వ్రా?) సేవేళ చేరి పరాకై నదంటా
అత్తి చనుమొనలేల అదిమేవు
బత్తిగలవాఁడవైతే పానుపుమీఁదికి రాఁగా
చిత్తమువచ్చినసేఁత సేసి చూపరాదా
(॥సందు॥)
కంటమాలిగుచ్చేవేళ కడుననువాయనంటా
అంటేవు మర్మములు నీ వంతలోననే
నంటుగలవాఁడవు నవ్వుతా విడెమియ్యఁగ
వొంటినీబలిమి చూపి వొరయఁగరాదా
(॥సందు॥)
కాఁపురము సేసేవేళ కడు సందడైనదంటా
యేపునఁగాఁగిలంచి యెనసితివి
యీపాటివాఁడవు ఇప్పుడే శ్రీవేంకటేశ
వోపినట్టలా రతుల వొద్దిక గారాదా
(||pallavi||)
saṁdusuḍi nemigi sari niṁta sesevu
kaṁduvagu rām̐gā biṁkamu sūbarādā
(||saṁdu||)
sittaruvuvā(vrā?) seveḽa seri parāgai nadaṁṭā
atti sanumŏnalela adimevu
battigalavām̐ḍavaide pānubumīm̐digi rām̐gā
sittamuvachchinasem̐ta sesi sūbarādā
(||saṁdu||)
kaṁṭamāliguchcheveḽa kaḍunanuvāyanaṁṭā
aṁṭevu marmamulu nī vaṁtalonane
naṁṭugalavām̐ḍavu navvudā viḍĕmiyyam̐ga
vŏṁṭinībalimi sūbi vŏrayam̐garādā
(||saṁdu||)
kām̐puramu seseveḽa kaḍu saṁdaḍainadaṁṭā
yebunam̐gām̐gilaṁchi yĕnasidivi
yībāḍivām̐ḍavu ippuḍe śhrīveṁkaḍeśha
vobinaṭṭalā radula vŏddiga gārādā