Samdurumdu nudaimche jalluna vennelagaase

చందురుఁడు నుదఇంచె జల్లున వెన్నెలగాసె
Language

(॥పల్లవి॥)
చందురుఁడు నుదఇంచె జల్లున వెన్నెలగాసె
చందములు సేసుకొని సమ్మతించరాదా

(॥చందు॥)
దొరకొనినమాటల దొంతులు నీవు వెట్టంగ
యెరపుల మారుత్తరా లేమిచ్చేము
తరుణి వాతనికి నాతఁడు నీకు రమణుఁడు
మరిగి నీకోపమెల్ల మానరాదా ఇఁకను

(॥చందు॥)
యెంచి అతనినేరాలే ఇటు వాములు వేయఁగ
అంచెల నెందాఁకా నేము ఆడుకొనేము
కొంచ కాతఁడుబాసిచ్చె గురిగా నిలిచితివి
ఇంచుకంత మోవితేనె లియ్యరాదా ఇఁకను

(॥చందు॥)
కేరడపునవ్వులే కిమ్ముల వెదవెట్టఁగ
సారెసారె నిన్నెట్ల సాదించేము
కోరి శ్రీవేంకటేశుఁడు గూడె నీవు గూడితివి
వూరడై వొక్కుమ్మడి నీవుఁడరాదా ఇఁకను

(||pallavi||)
saṁdurum̐ḍu nuda̮iṁchĕ jalluna vĕnnĕlagāsĕ
saṁdamulu sesugŏni sammadiṁcharādā

(||saṁdu||)
dŏragŏninamāḍala dŏṁtulu nīvu vĕṭṭaṁga
yĕrabula māruttarā lemichchemu
taruṇi vādanigi nādam̐ḍu nīgu ramaṇum̐ḍu
marigi nīgobamĕlla mānarādā im̐kanu

(||saṁdu||)
yĕṁchi adaninerāle iḍu vāmulu veyam̐ga
aṁchĕla nĕṁdām̐kā nemu āḍugŏnemu
kŏṁcha kādam̐ḍubāsichchĕ gurigā nilisidivi
iṁchugaṁta movidenĕ liyyarādā im̐kanu

(||saṁdu||)
keraḍabunavvule kimmula vĕdavĕṭṭam̐ga
sārĕsārĕ ninnĕṭla sādiṁchemu
kori śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ nīvu gūḍidivi
vūraḍai vŏkkummaḍi nīvum̐ḍarādā im̐kanu