Samdisesi penamgagu sadamau nitte

చండిసేసి పెనఁగకు సతమౌ నిట్టె
Language

(॥పల్లవి॥)
చండిసేసి పెనఁగకు సతమౌ నిట్టె
నిండుక వుండినదే నేరుపువో చెలి

(॥॥)
తారుకాణగాఁగ నాతనికి విన్నవించవే
వూరకుండినా అది వొడఁ బడ్డట్టే
వోరలేక నేరుపున నొడఁ బరచవే చేరి
గారవించి చూచినాను కై కొన్నట్టే

(॥॥)
కొలువులో నాతనిఁ గూరిములు గొసరవే
తెలిసి నవ్వినా సమ్మతించినయట్టే
పలుమారు పేరుకొని బత్తితోడఁ బిలువవే
యెలమి నూఁకొనినాను ఇయ్యకొన్నయట్టే

(॥॥)
శ్రీ వేంకటేశ్వరుని చేతికిఁ గానుకియ్యవే
వావిరి నందుకొనినా వచ్చినయట్టే
యీవేళ నన్నుఁ గూడె యీడకుఁ దానె విచ్చేసి
వావులు చెప్పించుకోవే వలచివయట్టే

(||pallavi||)
saṁḍisesi pĕnam̐gagu sadamau niṭṭĕ
niṁḍuga vuṁḍinade nerubuvo sĕli

(||||)
tārugāṇagām̐ga nādanigi vinnaviṁchave
vūraguṁḍinā adi vŏḍam̐ baḍḍaṭṭe
voralega nerubuna nŏḍam̐ barasave seri
gāraviṁchi sūsinānu kai kŏnnaṭṭe

(||||)
kŏluvulo nādanim̐ gūrimulu gŏsarave
tĕlisi navvinā sammadiṁchinayaṭṭe
palumāru perugŏni battidoḍam̐ biluvave
yĕlami nūm̐kŏninānu iyyagŏnnayaṭṭe

(||||)
śhrī veṁkaḍeśhvaruni sedigim̐ gānugiyyave
vāviri naṁdugŏninā vachchinayaṭṭe
yīveḽa nannum̐ gūḍĕ yīḍagum̐ dānĕ vichchesi
vāvulu sĕppiṁchugove valasivayaṭṭe