సందేహ మెక్కడా లేదు సంతోషించుకొంటి నేను
(॥పల్లవి॥)
సందేహ మెక్కడా లేదు సంతోషించుకొంటి నేను
కందువ బ్రహ్మానందము గైకొంటి నేను
(॥సందేహ॥)
నున్నఁగా సంకీర్తన నా నోరి కిచ్చితి గనక
నన్ను రక్షింతువే యనుచు నమ్మితి నేను
పిన్ననాఁడె నీవు నన్నుఁ బేరుకొంటివి గనక
యెన్నఁగ నీడేర్తు వని యియ్యకొంటి నేను
(॥సందేహ॥)
శ్రీకాంతుఁడ నీ మూర్తి నా చిత్తములో నిల్పఁగాను
నాకు నీవు గలవని నమ్మితి నేను
దాకొని లోకములో నీ దాసుఁడనిపించఁగా
యీకడ నేలితివని యెఱిఁగితి నేను
(॥సందేహ॥)
కైవసమై నీవు నాకు కలలో నానతియ్యఁగా
నావద్ద నున్నాఁడ వని నమ్మితి నేను
యేవేళా శ్రీవేంకటేశ యెదుటనే వుండఁగాను
పావనమైయిన్నిటాను ప్రబలితి నేను
(||pallavi||)
saṁdeha mĕkkaḍā ledu saṁtoṣhiṁchugŏṁṭi nenu
kaṁduva brahmānaṁdamu gaigŏṁṭi nenu
(||saṁdeha||)
nunnam̐gā saṁkīrdana nā nori kichchidi ganaga
nannu rakṣhiṁtuve yanusu nammidi nenu
pinnanām̐ḍĕ nīvu nannum̐ berugŏṁṭivi ganaga
yĕnnam̐ga nīḍerdu vani yiyyagŏṁṭi nenu
(||saṁdeha||)
śhrīgāṁtum̐ḍa nī mūrdi nā sittamulo nilbam̐gānu
nāgu nīvu galavani nammidi nenu
dāgŏni logamulo nī dāsum̐ḍanibiṁcham̐gā
yīgaḍa nelidivani yĕṟim̐gidi nenu
(||saṁdeha||)
kaivasamai nīvu nāgu kalalo nānadiyyam̐gā
nāvadda nunnām̐ḍa vani nammidi nenu
yeveḽā śhrīveṁkaḍeśha yĕduḍane vuṁḍam̐gānu
pāvanamaiyinniḍānu prabalidi nenu