చందమయ్యీ నన్నియు జాజరకాఁడ
(॥పల్లవి॥)
చందమయ్యీ నన్నియు జాజరకాఁడ
విందులుగా మోవి యిచ్చి వేఁడుకోరాదా
(॥చంద॥)
అచ్చముగ చెలి నిన్ను నానవెట్టుమనఁగానే
పచ్చిదేరె నీమాటలు పంతగాఁడా
నిచ్చలు నీవు చేసిన నేరములన్నియుఁ బాయ
కొచ్చి కొచ్చి యిట్టే వేఁడుకొనరాదా
(॥చంద॥)
తనమోమప్పటి నిన్నుఁ దప్పక చూడు మంటేనే
కొనకెక్కె నీ సేఁతలు కోడెకాఁడా
తనివొంది నీవలని తప్పులివి వొప్పులుగ
ననుపుగ వేఁడుకొనఁగరాదా
(॥చంద॥)
గక్కనను తన్ను ముట్టి కాఁగిలించ మనఁగానే
చిక్కెను నీసుద్దులెల్ల శ్రీవేంకటేశ
చెక్కు నొక్కి కూడితివి చింతలెల్లఁ దీరఁగ
వెక్కసముగా నింక వేఁడుకోరాదా
(||pallavi||)
saṁdamayyī nanniyu jājaragām̐ḍa
viṁdulugā movi yichchi vem̐ḍugorādā
(||saṁda||)
achchamuga sĕli ninnu nānavĕṭṭumanam̐gāne
pachchiderĕ nīmāḍalu paṁtagām̐ḍā
nichchalu nīvu sesina neramulanniyum̐ bāya
kŏchchi kŏchchi yiṭṭe vem̐ḍugŏnarādā
(||saṁda||)
tanamomappaḍi ninnum̐ dappaga sūḍu maṁṭene
kŏnagĕkkĕ nī sem̐talu koḍĕgām̐ḍā
tanivŏṁdi nīvalani tappulivi vŏppuluga
nanubuga vem̐ḍugŏnam̐garādā
(||saṁda||)
gakkananu tannu muṭṭi kām̐giliṁcha manam̐gāne
sikkĕnu nīsuddulĕlla śhrīveṁkaḍeśha
sĕkku nŏkki kūḍidivi siṁtalĕllam̐ dīram̐ga
vĕkkasamugā niṁka vem̐ḍugorādā