సందడించీ వలపు నీ సముకానను
(॥పల్లవి॥)
సందడించీ వలపు నీ సముకానను
యిందరి కూరిములు నీవియ్యకొనవయ్యా
(॥సంద॥)
యెలమిఁ గొలువుసేసీ నీకెఁ జిత్తగించవయ్య
సొలసి నవ్వీ నీకెఁ జూడవయ్యా
కలయఁ గానుకిచ్చీని కాంతచే నందుకోవయ్య
అలమి మొక్కీ నీకె నాదరించవయ్యా
(॥సంద॥)
యెదుట నున్నది చెలి యెఱుక చేసుకోవయ్య
అదె వీడెమిచ్చీ నాకె అందవయ్యా
పొదిగి విన్నవించీని పొలఁతిచే వినవయ్య
కదిసినదీకె వూడిగము గొనవయ్యా
(॥సంద॥)
అతివ చన్నులనొత్తీ నవధరించవయ్య
రతులు నేరిపీ నాపె రమ్మనవయ్యా
సతమై శ్రీవేంకటేశ సరి నన్ను నేలితివి
యితవరి యీకె చేఁతలెంచుకొనవయ్యా
(||pallavi||)
saṁdaḍiṁchī valabu nī samugānanu
yiṁdari kūrimulu nīviyyagŏnavayyā
(||saṁda||)
yĕlamim̐ gŏluvusesī nīgĕm̐ jittagiṁchavayya
sŏlasi navvī nīgĕm̐ jūḍavayyā
kalayam̐ gānugichchīni kāṁtase naṁdugovayya
alami mŏkkī nīgĕ nādariṁchavayyā
(||saṁda||)
yĕduḍa nunnadi sĕli yĕṟuga sesugovayya
adĕ vīḍĕmichchī nāgĕ aṁdavayyā
pŏdigi vinnaviṁchīni pŏlam̐tise vinavayya
kadisinadīgĕ vūḍigamu gŏnavayyā
(||saṁda||)
adiva sannulanŏttī navadhariṁchavayya
radulu neribī nābĕ rammanavayyā
sadamai śhrīveṁkaḍeśha sari nannu nelidivi
yidavari yīgĕ sem̐talĕṁchugŏnavayyā