సందడిలో నెందాఁకా సారెకు గుబ్బతిల్లేవు(రు?)
(॥పల్లవి॥)
సందడిలో నెందాఁకా సారెకు గుబ్బతిల్లేవు(రు?)
కందువైన చోటనే జోకగా నుండరయ్యా
(॥॥)
సరసమాడినఁ గాని చవి గావు వలపులు
తెర వేసుకొన్నఁ గాని తీరదు సిగ్గు
వొరసి నవ్వినఁ గాని వొక్కటి గాదు మనసు
తరుణి నీవు నేక తాన నుండరయ్యా
(॥॥)
పచ్చి మాటాడినఁ గాని భావములు గరఁగవు
యిచ్చఁ గొసరినఁ గాని ఇంపు రేఁగదు
విచ్చనవిడైనఁ గాని వెలయపు కోరికెలు
పచ్చల మేడలోనఁ బవ్వళించరయ్యా
(॥॥)
బిగువుఁగాఁగిటఁ గాని ప్రియములు సమకోవు
తగులైనఁ గాని లేదు తరితీపు
మిగుల శ్రీవేంకటేశ మెలుఁత నేలితి విట్టే
నగరిలోననే వుండి నంటు చూపరయ్యా
(||pallavi||)
saṁdaḍilo nĕṁdām̐kā sārĕgu gubbadillevu(ru?)
kaṁduvaina soḍane jogagā nuṁḍarayyā
(||||)
sarasamāḍinam̐ gāni savi gāvu valabulu
tĕra vesugŏnnam̐ gāni tīradu siggu
vŏrasi navvinam̐ gāni vŏkkaḍi gādu manasu
taruṇi nīvu nega tāna nuṁḍarayyā
(||||)
pachchi māḍāḍinam̐ gāni bhāvamulu garam̐gavu
yichcham̐ gŏsarinam̐ gāni iṁpu rem̐gadu
vichchanaviḍainam̐ gāni vĕlayabu korigĕlu
pachchala meḍalonam̐ bavvaḽiṁcharayyā
(||||)
biguvum̐gām̐giḍam̐ gāni priyamulu samagovu
tagulainam̐ gāni ledu taridību
migula śhrīveṁkaḍeśha mĕlum̐ta nelidi viṭṭe
nagarilonane vuṁḍi naṁṭu sūbarayyā