సందడికిఁ జొర నేల చలము సాధించ నేల
(॥పల్లవి॥)
సందడికిఁ జొర నేల చలము సాధించ నేల
అందెంది సరసమాడి అండ నుంట గాక
(॥సందడి॥)
పంతపు నీ మాటల బావించి తెలియఁ బోతే
కొంతము లై నాటుఁ గాక కొర తయ్యీనా
చింత లేల మాకును నీ చేఁతలే చూచుకొంటా
అంత కంతే చాలు ననే దది మేలుగాక
(॥సందడి॥)
నగెటి నీ నవ్వుల నయాన వహించుకొంటే
వొగరులే మించుఁ గాక వుడి వోయినా
తల వేల నీమంచితనానకే మెచ్చుకుంటా
మొగమొగా లెదుటనే మొక్కు కొంటఁ గాక
(॥సందడి॥)
కాఁగిటి నీరతులు గాలించి వెదకఁ బోతే
మాఁగినచవులే కాక మానఁ బోయీనా
సాఁగిన శ్రీవెంకటాద్రిపతి నన్నుఁ గూడితివి
పొఁగు వోఁగుఁ బొందినట్టు పురిగొంట గాక
(||pallavi||)
saṁdaḍigim̐ jŏra nela salamu sādhiṁcha nela
aṁdĕṁdi sarasamāḍi aṁḍa nuṁṭa gāga
(||saṁdaḍi||)
paṁtabu nī māḍala bāviṁchi tĕliyam̐ bode
kŏṁtamu lai nāḍum̐ gāga kŏra tayyīnā
siṁta lela māgunu nī sem̐tale sūsugŏṁṭā
aṁta kaṁte sālu nane dadi melugāga
(||saṁdaḍi||)
nagĕḍi nī navvula nayāna vahiṁchugŏṁṭe
vŏgarule miṁchum̐ gāga vuḍi voyinā
tala vela nīmaṁchidanānage mĕchchuguṁṭā
mŏgamŏgā lĕduḍane mŏkku kŏṁṭam̐ gāga
(||saṁdaḍi||)
kām̐giḍi nīradulu gāliṁchi vĕdagam̐ bode
mām̐ginasavule kāga mānam̐ boyīnā
sām̐gina śhrīvĕṁkaḍādribadi nannum̐ gūḍidivi
pŏm̐gu vom̐gum̐ bŏṁdinaṭṭu purigŏṁṭa gāga