Samchalagunamu naadi sari dheerumdavu neevu

చంచలగుణము నాది సరి ధీరుఁడవు నీవు
Language

(॥పల్లవి॥)
చంచలగుణము నాది సరి ధీరుఁడవు నీవు
నించి నీ మేలే నాపై నెరపవయ్యా

(॥॥)
సరి నెఱుఁగుదు నాపై సారె బత్తి గలుగుత
తరవాతికె రాకున్నఁ దమకింతును
కరఁగుదు నీవు నాపైఁ గల మన్నన దలఁచి
తెరమరఁ గైతే నే తెగువలె యాడుదు

(॥॥)
వా దడుతుఁ జెలులతో వడి నీవు బొంక వని
నా దెస చూడ కుండితే నమ్మకుండుదు
సాద వని పొగడుదు సరి నెదురాడకున్న
కా దందు నీవు పరాకై కడు నవ్వితేను

(॥॥)
చే యెత్తి మొక్కుదు నీవు చేసన్న సేసితేను
చాయ సేసుకుండితేను సాదింతును
యీ యెడ శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
కాయజకేలికే నిన్నుఁ గమ్మరఁ బిలుతును.

(||pallavi||)
saṁchalaguṇamu nādi sari dhīrum̐ḍavu nīvu
niṁchi nī mele nābai nĕrabavayyā

(||||)
sari nĕṟum̐gudu nābai sārĕ batti galuguda
taravādigĕ rāgunnam̐ damagiṁtunu
karam̐gudu nīvu nābaim̐ gala mannana dalam̐si
tĕramaram̐ gaide ne tĕguvalĕ yāḍudu

(||||)
vā daḍudum̐ jĕlulado vaḍi nīvu bŏṁka vani
nā dĕsa sūḍa kuṁḍide nammaguṁḍudu
sāda vani pŏgaḍudu sari nĕdurāḍagunna
kā daṁdu nīvu parāgai kaḍu navvidenu

(||||)
se yĕtti mŏkkudu nīvu sesanna sesidenu
sāya sesuguṁḍidenu sādiṁtunu
yī yĕḍa śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
kāyajagelige ninnum̐ gammaram̐ biludunu.