చంచలపడఁగవద్దు సారె సారెఁ గోరవద్దు
(॥పల్లవి॥)
చంచలపడఁగవద్దు సారె సారెఁ గోరవద్దు
పొంచుకున్న దైవమే బుద్ధులు నేర్పీని
(॥చంచ॥)
లోకరక్షకుఁడు నాలోననే వున్నాఁడిదే
నాకు నభయములిచ్చి నన్నుఁ గాచును
శ్రీకాంతుఁడీతఁడే నాచిత్తములో మలసీని
దాకొని శుభములెల్లాఁ దానే వొసఁగును
(॥చంచ॥)
పరమపురుషుడు నాప్రాణనాథుఁడైనాఁడు
పరగ నాపాలివాఁడై బ్రదికించును
ధరణీశుఁ డీతఁడే నాదాపుదండై కడఁగీని
నిరతి నేపొద్దును మన్నించును మమ్మెపుడు
(॥చంచ॥)
శ్రీవేంకటేశుఁడు నాజిహ్వఁ దగిలి వున్నాఁడు
పావనునిఁ జేసి నాకు ఫల మిచ్చును
గోవిందుఁ డీస్వామి నన్నుఁ గొలిపించుకొన్నవాఁడు
యీవల నావల నాకు నిహపరా లిచ్చును
(||pallavi||)
saṁchalabaḍam̐gavaddu sārĕ sārĕm̐ goravaddu
pŏṁchugunna daivame buddhulu nerbīni
(||saṁcha||)
logarakṣhagum̐ḍu nālonane vunnām̐ḍide
nāgu nabhayamulichchi nannum̐ gāsunu
śhrīgāṁtum̐ḍīdam̐ḍe nāsittamulo malasīni
dāgŏni śhubhamulĕllām̐ dāne vŏsam̐gunu
(||saṁcha||)
paramaburuṣhuḍu nāprāṇanāthum̐ḍainām̐ḍu
paraga nābālivām̐ḍai bradigiṁchunu
dharaṇīśhum̐ ḍīdam̐ḍe nādābudaṁḍai kaḍam̐gīni
niradi nebŏddunu manniṁchunu mammĕbuḍu
(||saṁcha||)
śhrīveṁkaḍeśhum̐ḍu nājihvam̐ dagili vunnām̐ḍu
pāvanunim̐ jesi nāgu phala michchunu
goviṁdum̐ ḍīsvāmi nannum̐ gŏlibiṁchugŏnnavām̐ḍu
yīvala nāvala nāgu nihabarā lichchunu