Sama taarugaana laide sala memta yekkuno

సమ తారుకాణ లైతే చల మెంత యెక్కునో
Language

(॥పల్లవి॥)
సమ తారుకాణ లైతే చల మెంత యెక్కునో
అమర దింతక తొల్లె యలిగి యెరఁగను

(॥మతారు॥)
కోపగించే మాఁటలకు గురి గాఁగ బని లెదు
రాపుగా నావద్ది కింక రాకు మనరే
యేపునఁ జెలులు చేప్పేయెడమాఁటలే చాలు
తీపుల నెన్నఁడుఁ దన్నుఁ దెగనా డెరఁగను

(॥మతారు॥)
దారి తప్పి నందుమీఁద దగ్గరి రాఁ బని లేదు
సారెకు నన్నుఁ బిలిపించకు మనరే
యీరస మణగుఁదాక యేకతములే మేలు
బీరమునఁ దనతో నేఁ బెనఁగి యెరఁగను

(॥మతారు॥)
బిలిమి లో నైన మీఁద బంత మాడఁ బని లేదు
వొలిసి కాఁగిట నిట్టె వుండు మనరే
యెలమి శ్రీవెంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె
మలసి తన కెదురు మాఁటా డెరఁగను

(||pallavi||)
sama tārugāṇa laide sala mĕṁta yĕkkuno
amara diṁtaga tŏllĕ yaligi yĕram̐ganu

(||madāru||)
kobagiṁche mām̐ṭalagu guri gām̐ga bani lĕdu
rābugā nāvaddi kiṁka rāgu manare
yebunam̐ jĕlulu seppeyĕḍamām̐ṭale sālu
tībula nĕnnam̐ḍum̐ dannum̐ dĕganā ḍĕram̐ganu

(||madāru||)
dāri tappi naṁdumīm̐da daggari rām̐ bani ledu
sārĕgu nannum̐ bilibiṁchagu manare
yīrasa maṇagum̐dāga yegadamule melu
bīramunam̐ danado nem̐ bĕnam̐gi yĕram̐ganu

(||madāru||)
bilimi lo naina mīm̐da baṁta māḍam̐ bani ledu
vŏlisi kām̐giḍa niṭṭĕ vuṁḍu manare
yĕlami śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūḍĕ
malasi tana kĕduru mām̐ṭā ḍĕram̐ganu