Sama mohamuladoda samgadi bhramadadoda

సమ మోహములతోడ సంగడి భ్రమతతోడ
Language

(॥పల్లవి॥)
సమ మోహములతోడ సంగడి భ్రమతతోడ
నిమిషము సందేహించి నిలిచి రిద్దరును

(॥సమ॥)
వనితకుచంబులు వనజంబులు హరి-
కనుచూపుతామరలు కలబెరకై
యెనసి చిక్కువడి యేరుపరచఁగరాక
నినుపునివ్వెరగుల నిలిచి రిద్దరును

(॥సమ॥)
కాంతచెక్కుటద్దముల ఘనునిచెక్కుటద్దాల-
కాంతి నిద్దరిచూపులు కలబెరకై
అంతలోనే తమమేను లవె తడఁబడెనని
వింతలై నిలిచి రట్టె వెరగై యిద్దరును

(॥సమ॥)
చెలిబాహులతలును శ్రీవేంకటేశ్వరుని-
కలయుబాహులతలు కలబెరకై
అలమి మరుకేళిని అవి యేర్పరచరాక
నెలకొన్న మరపున నిలిచి రిద్దరును

(||pallavi||)
sama mohamuladoḍa saṁgaḍi bhramadadoḍa
nimiṣhamu saṁdehiṁchi nilisi riddarunu

(||sama||)
vanidagusaṁbulu vanajaṁbulu hari-
kanusūbudāmaralu kalabĕragai
yĕnasi sikkuvaḍi yerubarasam̐garāga
ninubunivvĕragula nilisi riddarunu

(||sama||)
kāṁtasĕkkuḍaddamula ghanunisĕkkuḍaddāla-
kāṁti niddarisūbulu kalabĕragai
aṁtalone tamamenu lavĕ taḍam̐baḍĕnani
viṁtalai nilisi raṭṭĕ vĕragai yiddarunu

(||sama||)
sĕlibāhuladalunu śhrīveṁkaḍeśhvaruni-
kalayubāhuladalu kalabĕragai
alami marugeḽini avi yerbarasarāga
nĕlagŏnna marabuna nilisi riddarunu