Saluvalu vemdlu jarabamga nemtigi

చలువలు వేండ్లు జరపఁగ నేఁటికి
Language

(॥పల్లవి॥)
చలువలు వేండ్లు జరపఁగ నేఁటికి
నెలవగు మేలే నించఁగ రాదా

(॥చలువలు॥)
మోహము చెలిపై ముంచినవాఁడవు
దాహపువిరహము తర వేల
సాహసి మొదలనె చలముల కోపదు
యీహల నీవే యెఱుఁగుదు విఁకను

(॥చలువలు॥)
చేసన్నలనే చెనకినవాఁడవు
వాసులు సతిపై వంచుదురా
ఆసలనే కడు నలసిన దిందాఁక
ఆ సుద్దులు మ మ్మడుగకు మిఁకమ

(॥చలువు॥)
కాఁగిట నంగనఁ గలసినవాఁడవు
మాఁగినసిగ్గులు మరి యాల
చేఁగ దేర్చె నిదె శ్రీవెంకటేశ్వర
వీఁగక ననుపులు విడుమాకు మిఁకనూ

(||pallavi||)
saluvalu veṁḍlu jarabam̐ga nem̐ṭigi
nĕlavagu mele niṁcham̐ga rādā

(||saluvalu||)
mohamu sĕlibai muṁchinavām̐ḍavu
dāhabuvirahamu tara vela
sāhasi mŏdalanĕ salamula kobadu
yīhala nīve yĕṟum̐gudu vim̐kanu

(||saluvalu||)
sesannalane sĕnaginavām̐ḍavu
vāsulu sadibai vaṁchudurā
āsalane kaḍu nalasina diṁdām̐ka
ā suddulu ma mmaḍugagu mim̐kama

(||saluvu||)
kām̐giḍa naṁganam̐ galasinavām̐ḍavu
mām̐ginasiggulu mari yāla
sem̐ga dersĕ nidĕ śhrīvĕṁkaḍeśhvara
vīm̐gaga nanubulu viḍumāgu mim̐kanū