చలువకు వేఁడికిని సరి సరి యింతేకాక
(॥పల్లవి॥)
చలువకు వేఁడికిని సరి సరి యింతేకాక
అలయించి మీఁది పొందు లవియేలే నాకు
(॥చలు॥)
పిలిచినప్పుడు రాక బిగిసి వెనక వచ్చి
యెలమిఁ బైకొనఁగా నదేఁటికే నాకు
తొలుత రాళ్లవేసి తోడఁ బూవుల వేయఁగ
కలదా అందేమైన కానీవే తాను
(॥చలు॥)
నవ్వినప్పుడు నవ్వక నాతో మర్నాఁడు వచ్చి
ఇవ్వల సరసమాడీ నేఁటికే నాకు
నెవ్వగా నీరువట్టైతే నేయి చేతికివచ్చి మరి
అవ్వలఁ బన్నీరిచ్చితే అనునౌనా తాను
(॥చలు॥)
చూపులనే కరఁగక సోఁకులఁ గాఁగిటఁ గూడా
యేపునఁ గరఁగఁగా నదేఁటికే నాకు
పైపై శ్రీవేంకటాద్రి పతితో నే నొక్కటైతి
కోపాన నేనంటి నింతే కొసరేలే యిఁకను
(||pallavi||)
saluvagu vem̐ḍigini sari sari yiṁtegāga
alayiṁchi mīm̐di pŏṁdu laviyele nāgu
(||salu||)
pilisinappuḍu rāga bigisi vĕnaga vachchi
yĕlamim̐ baigŏnam̐gā nadem̐ṭige nāgu
tŏluda rāḽlavesi toḍam̐ būvula veyam̐ga
kaladā aṁdemaina kānīve tānu
(||salu||)
navvinappuḍu navvaga nādo marnām̐ḍu vachchi
ivvala sarasamāḍī nem̐ṭige nāgu
nĕvvagā nīruvaṭṭaide neyi sedigivachchi mari
avvalam̐ bannīrichchide anunaunā tānu
(||salu||)
sūbulane karam̐gaga som̐kulam̐ gām̐giḍam̐ gūḍā
yebunam̐ garam̐gam̐gā nadem̐ṭige nāgu
paibai śhrīveṁkaḍādri padido ne nŏkkaḍaidi
kobāna nenaṁṭi niṁte kŏsarele yim̐kanu