చల్లఁగా బతుకవయ్య సమ్మతైన పాటే చాలు
(॥పల్లవి॥)
చల్లఁగా బతుకవయ్య సమ్మతైన పాటే చాలు
వొల్లకున్నా బుద్దిచెప్పే వొడఁబాటు లేలా
(॥చల్లఁ॥)
తొలుత రానికోపాన దూరితిఁగాక నిన్ను
వలపుగలంతేకాక వచ్చేవా నీవు
తలఁచి తలఁచి నీకే తగ వొప్పింతుఁగాక
అలయించి నిన్నుఁదెచ్చేయంత బలిమేలా
(॥చల్లఁ॥)
తత్తరించి కొంగువట్టి తమి రేఁచితిఁ గాక నీ -
చిత్తముము వచ్చినఁగాక సేసేవా నీవు
పొత్తులకూటమి నీకే పుణ్యము గట్టుదుఁగాక
బత్తి గొట్టాన బెట్టేటి వంతము నాకేలా
(॥చల్లఁ॥)
యెదుట నుండఁగా నిన్ను ఇన్నియు నవ్వితినేను
అదనైనఁదాఁకఁగాక అంటేవా నీవు
ఇదివో శ్రీవేంకటశ ఇప్పుడే కలసితివి
ముదమైన రతి చాలు మొక్కలములేలా
(||pallavi||)
sallam̐gā badugavayya sammadaina pāḍe sālu
vŏllagunnā buddisĕppe vŏḍam̐bāḍu lelā
(||sallam̐||)
tŏluda rānigobāna dūridim̐gāga ninnu
valabugalaṁtegāga vachchevā nīvu
talam̐si talam̐si nīge taga vŏppiṁtum̐gāga
alayiṁchi ninnum̐dĕchcheyaṁta balimelā
(||sallam̐||)
tattariṁchi kŏṁguvaṭṭi tami rem̐sidim̐ gāga nī -
sittamumu vachchinam̐gāga sesevā nīvu
pŏttulagūḍami nīge puṇyamu gaṭṭudum̐gāga
batti gŏṭṭāna bĕṭṭeḍi vaṁtamu nāgelā
(||sallam̐||)
yĕduḍa nuṁḍam̐gā ninnu inniyu navvidinenu
adanainam̐dām̐kam̐gāga aṁṭevā nīvu
idivo śhrīveṁkaḍaśha ippuḍe kalasidivi
mudamaina radi sālu mŏkkalamulelā