చల్లఁగా బదుకవయ్య సాదించేమా నిన్ను నేఁడు
(॥పల్లవి॥)
చల్లఁగా బదుకవయ్య సాదించేమా నిన్ను నేఁడు
చెల్లు నీకు నన్నియును చెప్పిచూప నేఁటికి
(॥చల్లఁ॥)
బాససేయనేరుతువు పనిగొననేరుతువు
ఆసకొలుపనేర్తువు ఆఁటదానిని
సేసేవారివూడిగాలు సేయించుకొనేరుతువు
నీసుద్దు లేమిచెప్పేవునేఁడు మాకుఁగొత్తలా
(॥చల్లఁ॥)
పొంద నిందుకుఁ గలవు పొరుగుకునుఁ గలవు
సందడిఁ గాలుదొక్కి మించఁగగలవు
యెందు నీవు నవ్వుతానే యెడము గైకొఁగలవు
దిందుపడఁ దొల్లె నేము తెలియనిపనులా
(॥చల్లఁ॥)
మొక్కు మొక్క నోపుదువు మోహించనోపుదువు
వొక్కటిగాఁ గూడివుండనోపుదువు
అక్కర శ్రీవేంకటేశ అలమేలుమంగను నేను
యెక్కువై మమ్మేలితివియెఱఁగమానేము
(||pallavi||)
sallam̐gā badugavayya sādiṁchemā ninnu nem̐ḍu
sĕllu nīgu nanniyunu sĕppisūba nem̐ṭigi
(||sallam̐||)
bāsaseyaneruduvu panigŏnaneruduvu
āsagŏlubanerduvu ām̐ṭadānini
sesevārivūḍigālu seyiṁchugŏneruduvu
nīsuddu lemisĕppevunem̐ḍu māgum̐gŏttalā
(||sallam̐||)
pŏṁda niṁdugum̐ galavu pŏrugugunum̐ galavu
saṁdaḍim̐ gāludŏkki miṁcham̐gagalavu
yĕṁdu nīvu navvudāne yĕḍamu gaigŏm̐galavu
diṁdubaḍam̐ dŏllĕ nemu tĕliyanibanulā
(||sallam̐||)
mŏkku mŏkka nobuduvu mohiṁchanobuduvu
vŏkkaḍigām̐ gūḍivuṁḍanobuduvu
akkara śhrīveṁkaḍeśha alamelumaṁganu nenu
yĕkkuvai mammelidiviyĕṟam̐gamānemu