చల్ల లమ్మేవారమైతే సదరమైతిమా నీకు
(॥పల్లవి॥)
చల్ల లమ్మేవారమైతే సదరమైతిమా నీకు
యెల్ల చోటులకు వచ్చి యేల మొక్కేవయ్యా
(॥చల్ల॥)
అచ్చమైన గొల్లదాన నౌనయ్యా మంచివాఁడవు
పచ్చిమాట లాడుదురా పలుమారును
నిచ్చళమై నీచుట్టాలు నిండ వేగురున్నవారు
యెచ్చరించి సన్నసేసి యేల మొక్కేవయ్యా
(॥చల్ల॥)
ఆవులు మాఇలవేల్పు లంటకుమన్నాఁ బోనీక
కావరించి చెనకేవు గబ్బితనాన
పూవుల నేల వేసేవు పూఁపలయ్యీ నా చన్నులు
యీవేళనే సన్నసేసి యేల మొక్కేవయ్యా
(॥చల్ల॥)
యీ యేఁడే కొమరెనైతి యెక్కుడైన గరితెను
చేయివట్టి సుద్దు లేమి చెప్పేవయ్యా
పాయపు శ్రీవేంకటేశ పంతాన నన్నేలితివి
యేయడా నీకెదురాడ నేల మొక్కేవయ్యా
(||pallavi||)
salla lammevāramaide sadaramaidimā nīgu
yĕlla soḍulagu vachchi yela mŏkkevayyā
(||salla||)
achchamaina gŏlladāna naunayyā maṁchivām̐ḍavu
pachchimāḍa lāḍudurā palumārunu
nichchaḽamai nīsuṭṭālu niṁḍa vegurunnavāru
yĕchchariṁchi sannasesi yela mŏkkevayyā
(||salla||)
āvulu māilavelbu laṁṭagumannām̐ bonīga
kāvariṁchi sĕnagevu gabbidanāna
pūvula nela vesevu pūm̐palayyī nā sannulu
yīveḽane sannasesi yela mŏkkevayyā
(||salla||)
yī yem̐ḍe kŏmarĕnaidi yĕkkuḍaina garidĕnu
seyivaṭṭi suddu lemi sĕppevayyā
pāyabu śhrīveṁkaḍeśha paṁtāna nannelidivi
yeyaḍā nīgĕdurāḍa nela mŏkkevayyā