చలిమీ బలిమీఁ గద్దు సలిగేఁ గద్దు
(॥పల్లవి॥)
చలిమీ బలిమీఁ గద్దు సలిగేఁ గద్దు
వలపు చవులుగొన్న వనితను నేను
(॥చలిమి॥)
వేసరించనోపము వేమారు నిన్నును
వాసితోడనుండేము వాకిలి గాచి
నేసవెట్టితివి నాఁడే చేతులెత్తి నామీఁద
దోసిటిపాల పెండ్లికూఁతురను నేను
(॥చలిమి॥)
సారె దూరనోపము సాటికి బేటికి నిన్ను
బీరమున నుండేము నీపీఁటవద్దను
బార చాఁచితివి నాఁడే పక్కన నాకాఁగిటికి
కూరిమిఁ గాలుదొక్కిన కొమ్మను నేను
(॥చలిమి॥)
కక్కసించినోపము కడు శ్రీ వేంకటేశ్వర
యిక్కువఁ గూడుండేము నీ ఇంటిలోనను
దిక్కై యేలితివి నాఁడే తిరమైన రతులను
వొక్కటైన పట్టపుదేవులను నేను
(||pallavi||)
salimī balimīm̐ gaddu saligem̐ gaddu
valabu savulugŏnna vanidanu nenu
(||salimi||)
vesariṁchanobamu vemāru ninnunu
vāsidoḍanuṁḍemu vāgili gāsi
nesavĕṭṭidivi nām̐ḍe sedulĕtti nāmīm̐da
dosiḍibāla pĕṁḍligūm̐turanu nenu
(||salimi||)
sārĕ dūranobamu sāḍigi beḍigi ninnu
bīramuna nuṁḍemu nībīm̐ṭavaddanu
bāra sām̐sidivi nām̐ḍe pakkana nāgām̐giḍigi
kūrimim̐ gāludŏkkina kŏmmanu nenu
(||salimi||)
kakkasiṁchinobamu kaḍu śhrī veṁkaḍeśhvara
yikkuvam̐ gūḍuṁḍemu nī iṁṭilonanu
dikkai yelidivi nām̐ḍe tiramaina radulanu
vŏkkaḍaina paṭṭabudevulanu nenu