చలి వాసె జగడాలు చాలునే నీకు
(॥పల్లవి॥)
చలి వాసె జగడాలు చాలునే నీకు
కలిసిన యిందుమీఁదఁ గడమేలే నీకు
(॥చలి॥)
దగ్గర వచ్చి యతఁడు తమకించి వేఁడుకోఁగా
సిగ్గులుఁ జింతలు నింకఁ జెల్లదే నీకు
వెగ్గళించి యప్పటిని వేమారు నవ్వఁగాను
యెగ్గులునెమ్మెలుఁ జూపనేఁటికే నీకు
(॥చలి॥)
కన్నులఁ దప్పక చూచి కడుఁ బ్రియము చెప్పఁగా
వన్నెలఁ జలము చూపవద్దే నీకు
సన్నలఁ జాయల నిన్ను సమ్మతిలఁ జేయఁగాను
నిన్నటిపంతములు నేఁడేల నీకు
(॥చలి॥)
కడునానలు వెట్టుచు కాఁగిలించనందుమీఁద
తడఁబాటు గుంపెనలు తగదే నీకు
యెడయకు శ్రీవేంకటేశుఁడిట్టె నిన్నుఁ గూడె
వెడఁగు నీకపటపు విసువేలే నీకు
(||pallavi||)
sali vāsĕ jagaḍālu sālune nīgu
kalisina yiṁdumīm̐dam̐ gaḍamele nīgu
(||sali||)
daggara vachchi yadam̐ḍu tamagiṁchi vem̐ḍugom̐gā
siggulum̐ jiṁtalu niṁkam̐ jĕllade nīgu
vĕggaḽiṁchi yappaḍini vemāru navvam̐gānu
yĕggulunĕmmĕlum̐ jūbanem̐ṭige nīgu
(||sali||)
kannulam̐ dappaga sūsi kaḍum̐ briyamu sĕppam̐gā
vannĕlam̐ jalamu sūbavadde nīgu
sannalam̐ jāyala ninnu sammadilam̐ jeyam̐gānu
ninnaḍibaṁtamulu nem̐ḍela nīgu
(||sali||)
kaḍunānalu vĕṭṭusu kām̐giliṁchanaṁdumīm̐da
taḍam̐bāḍu guṁpĕnalu tagade nīgu
yĕḍayagu śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
vĕḍam̐gu nīgabaḍabu visuvele nīgu