చలములు మాని అన్నీఁ జవి సేసుకొంటిఁ గాక
(॥పల్లవి॥)
చలములు మాని అన్నీఁ జవి సేసుకొంటిఁ గాక
తెలివి మొగముననుఁ దేరునా వొరులకు
(॥చలములు॥)
చిత్తము నొవ్వకుండ చేతుల మొక్కితిఁ గాక
యిత్తల నీ చేసేచేఁత లెన్ని లేవు
వత్తివలె వాడక నీవద్దఁ జెలఁగేఁ గాక
కొత్తలుగ మోము చూడఁ గొలుపుగా యిందుకు
(॥చలములు॥)
కాఁకలు రేఁగకుండఁగ గానుక లిచ్చితిఁ గాక
యేఁకట నీ పొరపొచ్చే లెన్ని లేవు
ఆఁకలు సేయక నీకు నట్టే నే లో నైతిఁ గాక
పూఁకొన నైన రతికి నుద్యోగము వుట్టునా
(॥చలములు॥)
తగవులు దప్పకుండ దయతోఁ గూడితిఁ గాక
యెగసక్యాలు నీ వైతె నెన్ని లేవు
ఆగవడి శ్రీవెంటాధిప కూడితి నన్ను
వెగ టైన యిందుమీఁదు వేసటలు వుట్టునా
(||pallavi||)
salamulu māni annīm̐ javi sesugŏṁṭim̐ gāga
tĕlivi mŏgamunanum̐ derunā vŏrulagu
(||salamulu||)
sittamu nŏvvaguṁḍa sedula mŏkkidim̐ gāga
yittala nī sesesem̐ta lĕnni levu
vattivalĕ vāḍaga nīvaddam̐ jĕlam̐gem̐ gāga
kŏttaluga momu sūḍam̐ gŏlubugā yiṁdugu
(||salamulu||)
kām̐kalu rem̐gaguṁḍam̐ga gānuga lichchidim̐ gāga
yem̐kaḍa nī pŏrabŏchche lĕnni levu
ām̐kalu seyaga nīgu naṭṭe ne lo naidim̐ gāga
pūm̐kŏna naina radigi nudyogamu vuṭṭunā
(||salamulu||)
tagavulu dappaguṁḍa dayadom̐ gūḍidim̐ gāga
yĕgasakyālu nī vaidĕ nĕnni levu
āgavaḍi śhrīvĕṁṭādhiba kūḍidi nannu
vĕga ṭaina yiṁdumīm̐du vesaḍalu vuṭṭunā