Salamula maanave sarasunido

చలముల మానవె సరసునితో
Language

(॥పల్లవి॥)
చలముల మానవె సరసునితో
అలుకలకంటెఁ బ్రియంబులె మేలు

(॥చల॥)
బింకపుమాటలు పెక్కులాడఁగా
మంకులు మిగులును మగువలకు
లంకెలపొందులు లావుగఁ జేసిన
పొంకపు వలపులు పొదిగొను

(॥చల॥)
బలిమి సరసములు పైపైనాడఁగ
తలఁపులు గరివడుఁ దరుణులకు
సెలవుల నగవులు చిమ్ముచుఁ బొదిగిన
తలకొనుఁ బైపైఁ దమకములు

(॥చల॥)
సటలకుఁ బలుమరు జంకెన చూపిన
కుటిలత లడరును కొమ్మలకు
యిటువలె శ్రీవేంకటేశుఁ గూడితివి
తటుకున నీడేరుఁ దగుఁగోరికలు

(||pallavi||)
salamula mānavĕ sarasunido
alugalagaṁṭĕm̐ briyaṁbulĕ melu

(||sala||)
biṁkabumāḍalu pĕkkulāḍam̐gā
maṁkulu migulunu maguvalagu
laṁkĕlabŏṁdulu lāvugam̐ jesina
pŏṁkabu valabulu pŏdigŏnu

(||sala||)
balimi sarasamulu paibaināḍam̐ga
talam̐pulu garivaḍum̐ daruṇulagu
sĕlavula nagavulu simmusum̐ bŏdigina
talagŏnum̐ baibaim̐ damagamulu

(||sala||)
saḍalagum̐ balumaru jaṁkĕna sūbina
kuḍilada laḍarunu kŏmmalagu
yiḍuvalĕ śhrīveṁkaḍeśhum̐ gūḍidivi
taḍuguna nīḍerum̐ dagum̐gorigalu