(॥పల్లవి॥)
చలమో పలమో సతి నీకు
పిలువఁగఁ బిలువఁగఁ బెనఁగేవూ
(॥చల॥)
తగిలి యతఁడు నినుఁ దడవఁగనూ
చిగురుఁజేతులను చిమ్మేవూ
అగపడి సరసములాడఁగనూ
నిగిడి బింకములు నెఱపేవూ
(॥చల॥)
నంటున నాతఁడు నవ్వఁగనూ
గెంటసంబులను కెలసేవూ
అంటి యతఁడు నిను నలమఁగనూ
యింటికి రమ్మని యెలయించేవూ
(॥చల॥)
శ్రీవేంకటేశుఁడు చెనకఁగనూ
భావ మెఱింగియుఁ బదరేవూ
యీవేళ విన్నితఁ డెనయఁగను
పూవుల వేయుచుఁ బొదిగేవూ
(||pallavi||)
salamo palamo sadi nīgu
piluvam̐gam̐ biluvam̐gam̐ bĕnam̐gevū
(||sala||)
tagili yadam̐ḍu ninum̐ daḍavam̐ganū
sigurum̐jedulanu simmevū
agabaḍi sarasamulāḍam̐ganū
nigiḍi biṁkamulu nĕṟabevū
(||sala||)
naṁṭuna nādam̐ḍu navvam̐ganū
gĕṁṭasaṁbulanu kĕlasevū
aṁṭi yadam̐ḍu ninu nalamam̐ganū
yiṁṭigi rammani yĕlayiṁchevū
(||sala||)
śhrīveṁkaḍeśhum̐ḍu sĕnagam̐ganū
bhāva mĕṟiṁgiyum̐ badarevū
yīveḽa vinnidam̐ ḍĕnayam̐ganu
pūvula veyusum̐ bŏdigevū