చలమేలే యీతని చనవు చేకొంటగాక
(॥పల్లవి॥)
చలమేలే యీతని చనవు చేకొంటగాక
పెలుచైనవానితోడఁ బెనఁగఁగరాదు
(॥చల॥)
తడయక పతి యెంతతరితీపులఁ బెట్టినా
పడఁతికి వేసరఁగఁ బాడిగాదు
చిడుముడి మరి నేమి సిగ్గులుమోవనాడినా
కొడిమ లెన్ని యతనిఁ గోపగించరాదు
(॥చల॥)
కమ్మటి నేలినవాఁడు కాఁక యెంతసేసినాను
కొమ్మ కెప్పుడు నొడ్డించుకొనఁగరాదు
కమ్ముకొని యంతలోనే కడుబలిమిసేసినా
దిమ్మురేఁచి యతనితో దీకొనఁగరాదు
(॥చల॥)
పొందైనవాఁ డెట్ల్ పొద్దులు గడపినాను
చందనగంధికి మీరి సాదించరాదు
అంది శ్రీవేంకటేశ్వరుఁ డదివో నిన్నుఁ గలసె
అందగాఁ డితని నెందు నలఇంచరాదు
(||pallavi||)
salamele yīdani sanavu segŏṁṭagāga
pĕlusainavānidoḍam̐ bĕnam̐gam̐garādu
(||sala||)
taḍayaga padi yĕṁtadaridībulam̐ bĕṭṭinā
paḍam̐tigi vesaram̐gam̐ bāḍigādu
siḍumuḍi mari nemi siggulumovanāḍinā
kŏḍima lĕnni yadanim̐ gobagiṁcharādu
(||sala||)
kammaḍi nelinavām̐ḍu kām̐ka yĕṁtasesinānu
kŏmma kĕppuḍu nŏḍḍiṁchugŏnam̐garādu
kammugŏni yaṁtalone kaḍubalimisesinā
dimmurem̐si yadanido dīgŏnam̐garādu
(||sala||)
pŏṁdainavām̐ ḍĕṭl pŏddulu gaḍabinānu
saṁdanagaṁdhigi mīri sādiṁcharādu
aṁdi śhrīveṁkaḍeśhvarum̐ ḍadivo ninnum̐ galasĕ
aṁdagām̐ ḍidani nĕṁdu nala̮iṁcharādu