Salamela vaddu jaanamdavu yee poddu

చలమేల వద్దు జాణఁడవు యీ పొద్దు
Language

(॥పల్లవి॥)
చలమేల వద్దు జాణఁడవు యీ పొద్దు
యెలుఁగెత్తి విన్నవించే ఇంటికి రారాదా

(॥చల॥)
మమ్మునేల లోఁచేవు మర్మాలేల రేఁచేవు
కమ్మర మాపైనేల కాలు చాఁచేవు
తమ్మిపువ్వు కడువాఁడి దండనే వెన్నెల వేఁడి
ఇమ్మల నింతటనైనా ఇంటి రారాదా

(॥చల॥)
సన్నలేల చేసేవు సడి యేల వేసేవు
చన్నులపై వాఁతలేల సారె వాసేపు
చిన్నిగాలికాఁక బెట్టు చిలుకలపలుకు రట్టు
యెని మాయలు సేసేవు ఇంటికి రారాదా

(॥చల॥)
ఆసలేల పెట్టేవు అట్టె కొంగేల పట్టేవు
వాసికి నాపాద మెంత వడి మెట్టేవు
వేసరక నన్నును శ్రీవేంకటేశ కూడితివి
యీసుద్దులన్నియు వింటి నింటికి రారాదా

(||pallavi||)
salamela vaddu jāṇam̐ḍavu yī pŏddu
yĕlum̐gĕtti vinnaviṁche iṁṭigi rārādā

(||sala||)
mammunela lom̐sevu marmālela rem̐sevu
kammara mābainela kālu sām̐sevu
tammibuvvu kaḍuvām̐ḍi daṁḍane vĕnnĕla vem̐ḍi
immala niṁtaḍanainā iṁṭi rārādā

(||sala||)
sannalela sesevu saḍi yela vesevu
sannulabai vām̐talela sārĕ vāsebu
sinnigāligām̐ka bĕṭṭu silugalabalugu raṭṭu
yĕni māyalu sesevu iṁṭigi rārādā

(||sala||)
āsalela pĕṭṭevu aṭṭĕ kŏṁgela paṭṭevu
vāsigi nābāda mĕṁta vaḍi mĕṭṭevu
vesaraga nannunu śhrīveṁkaḍeśha kūḍidivi
yīsuddulanniyu viṁṭi niṁṭigi rārādā