చల మింతేకాక మమ్ము సారెసారెఁ బొదిగేది
(॥పల్లవి॥)
చల మింతేకాక మమ్ము సారెసారెఁ బొదిగేది
వలెనంటే లోకములో వనితలు లేరా
(॥చల॥)
అలిగినవారితోడ నట్లె పెనఁగనేల
వెలయాండ్రు మరిలేరా వీదివీదుల
పలుకనివారి నేల పలికించే వప్పటిని
కెలసేసతులు నీకుఁ గెలన లేరా
(॥చల॥)
వూరకున్నవారినింత వొడివట్టి తియ్యనేల
ఆరితేరినచెలు లవ్వల లేరా
సారె నంటికాంతలను చలముసాదించనేల
తేరకాడుమగువలు దేశములో లేరా
(॥చల॥)
అలసియుండినవారి నాసలఁబెట్టగ నేల
పిలిచేయింతులు లేరా పెక్కుచోట్ల
బలిమి శ్రీవేంకటేశ పైకొని నన్నేలితివి
వలచిననన్ను వంటివారు నీకు లేరా
(||pallavi||)
sala miṁtegāga mammu sārĕsārĕm̐ bŏdigedi
valĕnaṁṭe logamulo vanidalu lerā
(||sala||)
aliginavāridoḍa naṭlĕ pĕnam̐ganela
vĕlayāṁḍru marilerā vīdivīdula
paluganivāri nela paligiṁche vappaḍini
kĕlasesadulu nīgum̐ gĕlana lerā
(||sala||)
vūragunnavāriniṁta vŏḍivaṭṭi tiyyanela
āriderinasĕlu lavvala lerā
sārĕ naṁṭigāṁtalanu salamusādiṁchanela
teragāḍumaguvalu deśhamulo lerā
(||sala||)
alasiyuṁḍinavāri nāsalam̐bĕṭṭaga nela
piliseyiṁtulu lerā pĕkkusoṭla
balimi śhrīveṁkaḍeśha paigŏni nannelidivi
valasinanannu vaṁṭivāru nīgu lerā