చల మింకానా నీకుఁ జాలదా నేఁడు
(॥పల్లవి॥)
చల మింకానా నీకుఁ జాలదా నేఁడు
సలిగెలు పతితోడఁ జాలదా నేఁడు
(॥చల॥)
వదనము వసివాడె వనిత నీకొప్పు వీడె
చదురులబింకము చాలదా నేఁడు
గుదిగొనెఁ బులకలు కుమ్మరించెఁ జెమటలు
సదమదమైతి వింకఁ జాలదా నేఁడు
(॥చల॥)
కన్నులఁ గెంపులుదేరెఁ గడునిట్టూర్పులు మీరె
సన్నలుఁజాయలు నింకఁ జాలదా నేఁడు
వెన్నగా మతి గరిఁగె విభుపైఁ దనువొరగె
సన్నపుమోవితిట్లు చాలదా నేఁడు
(॥చల॥)
సెలవుల నవ్వులు చిందె సిగ్గులు లోలోఁ గుందె
చలివేఁడి కొసరులు చాలదా నేఁడు
బలిమి శ్రీవేంకటాద్రిపతి నిన్ను నిదె కూడె
సళుపులెల్లాఁ బాసెఁ జాలదా నేఁడు
(||pallavi||)
sala miṁkānā nīgum̐ jāladā nem̐ḍu
saligĕlu padidoḍam̐ jāladā nem̐ḍu
(||sala||)
vadanamu vasivāḍĕ vanida nīgŏppu vīḍĕ
sadurulabiṁkamu sāladā nem̐ḍu
gudigŏnĕm̐ bulagalu kummariṁchĕm̐ jĕmaḍalu
sadamadamaidi viṁkam̐ jāladā nem̐ḍu
(||sala||)
kannulam̐ gĕṁpuluderĕm̐ gaḍuniṭṭūrbulu mīrĕ
sannalum̐jāyalu niṁkam̐ jāladā nem̐ḍu
vĕnnagā madi garim̐gĕ vibhubaim̐ danuvŏragĕ
sannabumovidiṭlu sāladā nem̐ḍu
(||sala||)
sĕlavula navvulu siṁdĕ siggulu lolom̐ guṁdĕ
salivem̐ḍi kŏsarulu sāladā nem̐ḍu
balimi śhrīveṁkaḍādribadi ninnu nidĕ kūḍĕ
saḽubulĕllām̐ bāsĕm̐ jāladā nem̐ḍu