Sakkanumdide nemu sadimbettemaa

చక్కనుండితే నేము సడిఁబెట్టేమా
Language

(॥పల్లవి॥)
చక్కనుండితే నేము సడిఁబెట్టేమా
పక్కనఁ దానే నవ్వి పచ్చిసేసెఁ గాక

(॥చక్క॥)
భావ మెరిఁగినవాడు పంతాలు నెరుపే వాఁడు
మావంటివారితోడ మాటాడ నేలే
దేవరవలెఁ దానుంటేఁ దిట్లాడ వచ్చేమా
తావుల నింతేసి మమ్ముఁదానె పంచెఁగాక

(॥చక్క॥)
తగ వెరిఁగినవాఁడు తాలిమి గలుగువాఁడు
యెగసెక్కేలు మాతోడ నింతేసి యేలే
నగుతాఁ దా నూరకున్న నాఁడె నేఁ బిలువనా
బిగిసి తా నింత మమ్ము పెనఁగించెఁ గాక

(॥చక్క॥)
చెప్పినట్టు సేసేవాఁడు శ్రీవేంకటపతి దాసు
తప్పులేని తప్పుచింత తన కేలే
యిప్పుడిట్టె నన్నుఁగూడె యింకా నేఁ గాదనేనా
చిప్పిలఁ దనకుఁ దానే సిగ్గువడీఁ గాక

(||pallavi||)
sakkanuṁḍide nemu saḍim̐bĕṭṭemā
pakkanam̐ dāne navvi pachchisesĕm̐ gāga

(||sakka||)
bhāva mĕrim̐ginavāḍu paṁtālu nĕrube vām̐ḍu
māvaṁṭivāridoḍa māḍāḍa nele
devaravalĕm̐ dānuṁṭem̐ diṭlāḍa vachchemā
tāvula niṁtesi mammum̐dānĕ paṁchĕm̐gāga

(||sakka||)
taga vĕrim̐ginavām̐ḍu tālimi galuguvām̐ḍu
yĕgasĕkkelu mādoḍa niṁtesi yele
nagudām̐ dā nūragunna nām̐ḍĕ nem̐ biluvanā
bigisi tā niṁta mammu pĕnam̐giṁchĕm̐ gāga

(||sakka||)
sĕppinaṭṭu sesevām̐ḍu śhrīveṁkaḍabadi dāsu
tappuleni tappusiṁta tana kele
yippuḍiṭṭĕ nannum̐gūḍĕ yiṁkā nem̐ gādanenā
sippilam̐ danagum̐ dāne sigguvaḍīm̐ gāga