చక్కనుండవే మాతోడి జగడాలు నీకేల
(॥పల్లవి॥)
చక్కనుండవే మాతోడి జగడాలు నీకేల
నిక్కి లోనయినవారు నిన్నుఁ బోలరా
(॥చక్క॥)
వచ్చి వచ్చి మాతోడి(డ) వంతులకే పెనఁగేవు
మెచ్చిన గొల్లెతలనాఁ డెందువోతివే
ముచ్చటదీర నితఁడు మోహించి తోసినయట్టి
నెచ్చెలు లింతకతొల్లి నీకొలఁదివారలా
(॥చక్క॥)
వుండుండి నీవు మాతో వొరయఁగ వచ్చేవు
నిండి పదారువేలలో నీపేరేదే
గండికాఁ డితఁడు పొంది కదుపునఁబెట్టినట్టి
అండనున్న సతులు నీయంత నేరరయ్యా
(॥చక్క॥)
నవ్వి నవ్వి మాతోను నంటుసేయఁదొడఁగేవు
యెవ్వతెవే పట్టపువారెనండ్రలో
రవ్వ శ్రీ వేంకటేశుఁడు రతి నన్ను నిటు గూడె
జవ్వనులు నీవలె సాదించనోపరా
(||pallavi||)
sakkanuṁḍave mādoḍi jagaḍālu nīgela
nikki lonayinavāru ninnum̐ bolarā
(||sakka||)
vachchi vachchi mādoḍi(ḍa) vaṁtulage pĕnam̐gevu
mĕchchina gŏllĕdalanām̐ ḍĕṁduvodive
muchchaḍadīra nidam̐ḍu mohiṁchi tosinayaṭṭi
nĕchchĕlu liṁtagadŏlli nīgŏlam̐divāralā
(||sakka||)
vuṁḍuṁḍi nīvu mādo vŏrayam̐ga vachchevu
niṁḍi padāruvelalo nīberede
gaṁḍigām̐ ḍidam̐ḍu pŏṁdi kadubunam̐bĕṭṭinaṭṭi
aṁḍanunna sadulu nīyaṁta nerarayyā
(||sakka||)
navvi navvi mādonu naṁṭuseyam̐dŏḍam̐gevu
yĕvvadĕve paṭṭabuvārĕnaṁḍralo
ravva śhrī veṁkaḍeśhum̐ḍu radi nannu niḍu gūḍĕ
javvanulu nīvalĕ sādiṁchanobarā