Sakkanivaamda vannidaa jaanavu neevu

చక్కనివాఁడ వన్నిటా జాణవు నీవు
Language

(॥పల్లవి॥)
చక్కనివాఁడ వన్నిటా జాణవు నీవు
యిక్కడ నాసంతోస మెంతనఁగ వచ్చును

(॥చక్క॥)
కన్నుల నన్నుఁజూచితే కాఁగిలించినట్టవును
సన్నసేసితే వలపు చల్లినట్టౌను
చిన్నినవ్వు నవ్వితేను సేసవెట్టి నట్టౌను
విన్నవించ నెట్టువచ్చు వేడుక నాలోనిది

(॥చక్క॥)
సారె మాటాడితే మోవి చవిగొననట్టౌను
చేరితేనే మేలెల్లా వచ్చినయట్టౌను
నేరుపుతోఁ జెనకితే నెమ్మిఁబెండ్లాడినట్టౌను
పేరుకొన నెట్టువచ్చు ప్రియములు నాకు

(॥చక్క॥)
మతి నీవు దలఁచితే మర్మము సోఁకినట్టౌను
రతిఁ గూడితేను కరఁగినట్టౌను
యితవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
తతిఁ బాయకుండితేను దక్కినట్టౌను

(||pallavi||)
sakkanivām̐ḍa vanniḍā jāṇavu nīvu
yikkaḍa nāsaṁtosa mĕṁtanam̐ga vachchunu

(||sakka||)
kannula nannum̐jūside kām̐giliṁchinaṭṭavunu
sannaseside valabu sallinaṭṭaunu
sinninavvu navvidenu sesavĕṭṭi naṭṭaunu
vinnaviṁcha nĕṭṭuvachchu veḍuga nālonidi

(||sakka||)
sārĕ māḍāḍide movi savigŏnanaṭṭaunu
seridene melĕllā vachchinayaṭṭaunu
nerubudom̐ jĕnagide nĕmmim̐bĕṁḍlāḍinaṭṭaunu
perugŏna nĕṭṭuvachchu priyamulu nāgu

(||sakka||)
madi nīvu dalam̐side marmamu som̐kinaṭṭaunu
radim̐ gūḍidenu karam̐ginaṭṭaunu
yidavai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
tadim̐ bāyaguṁḍidenu dakkinaṭṭaunu