చక్కనివాఁ డాతఁడు జాణవు నీవు
(॥పల్లవి॥)
చక్కనివాఁ డాతఁడు జాణవు నీవు
అక్కరతో నాతని యానతి వినవమ్మా
(॥చక్క॥)
వల్లెవాటు వేసుకొని వాఁడె నిలుచున్నవాఁడు
యిల్లిదె వీడెమంపె నీ కిందవమ్మా
చొల్లెపుఁ జుత్తులతోడఁజూచీ నిన్నప్పటనుంటి
యెల్లచందాలా దగు మీ యిద్దరికి నమ్మా
(॥చక్క॥)
నెత్తి కొప్పువాఁడు మంచినీలపుఁ గాంతులవాఁడు
బత్తితో గంద మంపెను పట్టవమ్మా
చిత్తము నీపైఁ బెట్టి సెలవుల నవ్వీవాఁడె
హత్తి యాతనితో మాఁటలాడవమ్మా
(॥చక్క॥)
కుప్పెఁ కటారముతోడి కోడెవయసువాఁడు
కప్పురము నీకు నంపెఁ గైకొనవమ్మా
అప్పుడు శ్రీవేంకటేశుఁ డదె వచ్చి నిన్ను నేలె
చిప్పిల విన్నపాలెల్లాఁ జేసుకోవమ్మా
(||pallavi||)
sakkanivām̐ ḍādam̐ḍu jāṇavu nīvu
akkarado nādani yānadi vinavammā
(||sakka||)
vallĕvāḍu vesugŏni vām̐ḍĕ nilusunnavām̐ḍu
yillidĕ vīḍĕmaṁpĕ nī kiṁdavammā
sŏllĕbum̐ juttuladoḍam̐jūsī ninnappaḍanuṁṭi
yĕllasaṁdālā dagu mī yiddarigi nammā
(||sakka||)
nĕtti kŏppuvām̐ḍu maṁchinīlabum̐ gāṁtulavām̐ḍu
battido gaṁda maṁpĕnu paṭṭavammā
sittamu nībaim̐ bĕṭṭi sĕlavula navvīvām̐ḍĕ
hatti yādanido mām̐ṭalāḍavammā
(||sakka||)
kuppĕm̐ kaḍāramudoḍi koḍĕvayasuvām̐ḍu
kappuramu nīgu naṁpĕm̐ gaigŏnavammā
appuḍu śhrīveṁkaḍeśhum̐ ḍadĕ vachchi ninnu nelĕ
sippila vinnabālĕllām̐ jesugovammā