(॥పల్లవి॥)
చక్కనిదానవు నీవు జవరాలవు
మక్కువ నీపైఁ చేయక మానవచ్చునా
(॥॥)
కన్నులఁ జూచినచూపు గండుతుమ్మిదల పూఁవు
సన్నల నవ్విన నవ్వు జాజిపువ్వు
పన్ని నీమోములో సిగ్గు వెన్నెల తేటనిగ్గు
వన్నెలనీరమణుఁడు వలచు టేమరుదే
(॥॥)
మలయ నీ పలుకులు మరునంపచిలుకులు
కలికికొప్పుజారు మేఘవుఁ దీరు
నిలువుఁ జక్కఁదనము నిండుజవ్వనవనము
బలిమి నాతఁడు నీకు భ్రమయు టేమరుదే
(॥॥)
వాఁ డిగోరిచెనకులు వజ్రాలమినుకులు
పోఁడిమి నీకెమ్మోవి పొగరుఁ గావి
నేఁడు శ్రీవేంకటేశుఁడు నిన్ను నింతలోనె కూడె
నాఁడే యీతఁడు నీకు ననుపౌటేమరిదే
(||pallavi||)
sakkanidānavu nīvu javarālavu
makkuva nībaim̐ seyaga mānavachchunā
(||||)
kannulam̐ jūsinasūbu gaṁḍudummidala pūm̐vu
sannala navvina navvu jājibuvvu
panni nīmomulo siggu vĕnnĕla teḍaniggu
vannĕlanīramaṇum̐ḍu valasu ṭemarude
(||||)
malaya nī palugulu marunaṁpasilugulu
kaligigŏppujāru meghavum̐ dīru
niluvum̐ jakkam̐danamu niṁḍujavvanavanamu
balimi nādam̐ḍu nīgu bhramayu ṭemarude
(||||)
vām̐ ḍigorisĕnagulu vajrālaminugulu
pom̐ḍimi nīgĕmmovi pŏgarum̐ gāvi
nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu ninnu niṁtalonĕ kūḍĕ
nām̐ḍe yīdam̐ḍu nīgu nanubauḍemaride