చక్కనిదానవంటాను సారెఁ బొగడేవు నన్ను
(॥పల్లవి॥)
చక్కనిదానవంటాను సారెఁ బొగడేవు నన్ను
యిక్కడివారి యెదుట నేమి బాఁతి నేను
(॥చక్క॥)
మంతానాన నాతోనే మాటలు నీవాడఁగానే
యెంతనెగులుండునో నీయింతుల కెల్లా
యింతేసి మమ్ము మన్నించి యేల దూరు గట్టేవు
కొంతైనా నే వారి కాలిగోరఁ బోలుదునా
(॥చక్క॥)
ననుపున నీవే నాతో నవ్వులెల్ల నవ్వఁగాను
వొనర నీ సతులెంత వుస్సురందురో
చనవిచ్చిందరిలోన సడి నాకేల కట్టేవు
పెనచి నే వారికెల్లఁ బిన్నదానఁగానా
(॥చక్క॥)
గక్కన నన్నిటు గూడి గడె వెట్టుకుండఁగాను
అక్కడి నీ సతు లేమనాడుకొందురో
యిక్కడ శ్రీవేంకటేశ యెక్కుడు సేసితి నన్ను
మిక్కిలి వారికి నే మేరమీరేదాననా
(||pallavi||)
sakkanidānavaṁṭānu sārĕm̐ bŏgaḍevu nannu
yikkaḍivāri yĕduḍa nemi bām̐ti nenu
(||sakka||)
maṁtānāna nādone māḍalu nīvāḍam̐gāne
yĕṁtanĕguluṁḍuno nīyiṁtula kĕllā
yiṁtesi mammu manniṁchi yela dūru gaṭṭevu
kŏṁtainā ne vāri kāligoram̐ boludunā
(||sakka||)
nanubuna nīve nādo navvulĕlla navvam̐gānu
vŏnara nī sadulĕṁta vussuraṁduro
sanavichchiṁdarilona saḍi nāgela kaṭṭevu
pĕnasi ne vārigĕllam̐ binnadānam̐gānā
(||sakka||)
gakkana nanniḍu gūḍi gaḍĕ vĕṭṭuguṁḍam̐gānu
akkaḍi nī sadu lemanāḍugŏṁduro
yikkaḍa śhrīveṁkaḍeśha yĕkkuḍu sesidi nannu
mikkili vārigi ne meramīredānanā