చక్కని జాణ యిన్నిటా జవరాలు
(॥పల్లవి॥)
చక్కని జాణ యిన్నిటా జవరాలు
చక్కెరబొమ్మవంటిది జవరాలు
(॥చక్క॥)
కన్నులఁ దప్పకచూచి కప్పురాన నిన్ను వేసి
సన్నసేసీ నదివో జవరాలు
వెన్నెలనవ్వులు నవ్వి వేడుక నీకుఁ బుట్టించి
చన్నుల నొరసీ నిన్ను జవరాలు
(॥చక్క॥)
తెరమరఁగుననుండి తేవెగార మాఁటలాడి
సరివెనఁగీ నీతో జవరాలు
విరులు నీపైఁ జల్లి వింతసేఁతలెల్లాఁజేసి
సరసములు నెరపీని జవరాలు
(॥చక్క॥)
తమకము నీకు రేఁచి దయవుట్ట సేవసేసి
సముకాన గొసరీని జవరాలు
అమర శ్రీవేంకటేశ యన్నిటా నీవుగూడఁగా
జమళిరతుల జొక్కీ జవరాలు
(||pallavi||)
sakkani jāṇa yinniḍā javarālu
sakkĕrabŏmmavaṁṭidi javarālu
(||sakka||)
kannulam̐ dappagasūsi kappurāna ninnu vesi
sannasesī nadivo javarālu
vĕnnĕlanavvulu navvi veḍuga nīgum̐ buṭṭiṁchi
sannula nŏrasī ninnu javarālu
(||sakka||)
tĕramaram̐gunanuṁḍi tevĕgāra mām̐ṭalāḍi
sarivĕnam̐gī nīdo javarālu
virulu nībaim̐ jalli viṁtasem̐talĕllām̐jesi
sarasamulu nĕrabīni javarālu
(||sakka||)
tamagamu nīgu rem̐si dayavuṭṭa sevasesi
samugāna gŏsarīni javarālu
amara śhrīveṁkaḍeśha yanniḍā nīvugūḍam̐gā
jamaḽiradula jŏkkī javarālu