చక్కని గుణవంతుఁడు సరి నీకు మగఁడాయ
(॥పల్లవి॥)
చక్కని గుణవంతుఁడు సరి నీకు మగఁడాయ
యెక్కువైన నీభాగ్య మేమని చెప్పుదమే
(॥చక్క॥)
నెలఁత నీ నోములు నేఁడె ఫలిఇంచెఁగదే
కలలు నీకిపుడె నిక్కలలాయెనే
పలికిన సగినాలు పతి వచ్చెఁగదవే
తలఁచఁగానే విభుఁడు తానే ఇందు వచ్చెను
(॥చక్క॥)
తొల్లిటి మీ పూజలు తుదకెక్కెఁగదవే
యెల్లగా నీకోరికలు యీడేరెనే
చెల్లు బడి నీ పంతము చేకూడె గదవే
యిల్లిదివో నీరమణుఁ డెదుటనున్నాఁడు
(॥చక్క॥)
నీ వెంచిన యెన్నికలు నెరవేరెఁగదవే
కావలసినవి తారుకాణలాయెనే
దేవుల వయితివి వావి దిష్టములాయఁ గదవే
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జేరికూడినాఁడు
(||pallavi||)
sakkani guṇavaṁtum̐ḍu sari nīgu magam̐ḍāya
yĕkkuvaina nībhāgya memani sĕppudame
(||sakka||)
nĕlam̐ta nī nomulu nem̐ḍĕ phaliiṁchĕm̐gade
kalalu nīgibuḍĕ nikkalalāyĕne
paligina saginālu padi vachchĕm̐gadave
talam̐sam̐gāne vibhum̐ḍu tāne iṁdu vachchĕnu
(||sakka||)
tŏlliḍi mī pūjalu tudagĕkkĕm̐gadave
yĕllagā nīgorigalu yīḍerĕne
sĕllu baḍi nī paṁtamu segūḍĕ gadave
yillidivo nīramaṇum̐ ḍĕduḍanunnām̐ḍu
(||sakka||)
nī vĕṁchina yĕnnigalu nĕraverĕm̐gadave
kāvalasinavi tārugāṇalāyĕne
devula vayidivi vāvi diṣhṭamulāyam̐ gadave
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jerigūḍinām̐ḍu