Sakkamdanaala mimchee nichchadam grshnumdu

చక్కఁదనాల మించీ నిచ్చటఁ గృష్ణుఁడు
Language

(॥పల్లవి॥)
చక్కఁదనాల మించీ నిచ్చటఁ గృష్ణుఁడు
వెక్కసీఁడు గదవమ్మ వెన్నముద్దకృష్ణుఁడు

(॥॥)
గొల్లెతలఁ గొంగువట్టీఁ గోరి కోరి కృష్ణుఁడు
వెల్లివిరిగా నవ్వీ వేడుకతోఁ గృష్ణుఁడు
పల్లదపుమదమునఁ బచ్చిదేరీఁ గృష్ణుఁడు
వెల్లివలపులు చల్లీ వెన్నముద్దకృష్ణుఁడు

(॥॥)
మంతనము లాడుతానే మరిగించీఁ గృష్ణుఁడు
బంతిమోవు లడిగీని బాలకృష్ణుఁడు
దొంతివెట్టి ముద్దులెల్ల దొరకొని గృష్ణుఁడు
వింతనేర్పులెల్లాఁ జూపీ వెన్నముద్దకృష్ణుఁడు

(॥॥)
బలిమిఁ గాఁగిట నించీ పాయకిదే కృష్ణుఁడు
తిలకించి చూపు చూచీ దిట్టకృష్ణుఁడు
కలసి మన్నించె విదే కైవసమై కృష్ణుఁడు
వెలసె శ్రీ వేంకటాద్రి వెన్నముద్దకృష్ణుఁడు

(||pallavi||)
sakkam̐danāla miṁchī nichchaḍam̐ gṛṣhṇum̐ḍu
vĕkkasīm̐ḍu gadavamma vĕnnamuddakṛṣhṇum̐ḍu

(||||)
gŏllĕdalam̐ gŏṁguvaṭṭīm̐ gori kori kṛṣhṇum̐ḍu
vĕllivirigā navvī veḍugadom̐ gṛṣhṇum̐ḍu
palladabumadamunam̐ bachchiderīm̐ gṛṣhṇum̐ḍu
vĕllivalabulu sallī vĕnnamuddakṛṣhṇum̐ḍu

(||||)
maṁtanamu lāḍudāne marigiṁchīm̐ gṛṣhṇum̐ḍu
baṁtimovu laḍigīni bālakṛṣhṇum̐ḍu
dŏṁtivĕṭṭi muddulĕlla dŏragŏni gṛṣhṇum̐ḍu
viṁtanerbulĕllām̐ jūbī vĕnnamuddakṛṣhṇum̐ḍu

(||||)
balimim̐ gām̐giḍa niṁchī pāyagide kṛṣhṇum̐ḍu
tilagiṁchi sūbu sūsī diṭṭakṛṣhṇum̐ḍu
kalasi manniṁchĕ vide kaivasamai kṛṣhṇum̐ḍu
vĕlasĕ śhrī veṁkaḍādri vĕnnamuddakṛṣhṇum̐ḍu