Sakkam joodaraadaa imti jaadalu neevu

చక్కఁ జూడరాదా ఇంతి జాడలు నీవు
Language

(॥పల్లవి॥)
చక్కఁ జూడరాదా ఇంతి జాడలు నీవు
యెక్కడ లేని యాసోద మెంత గద్దో కాని

(॥॥)
చెక్కులఁ జెమట గారీ నేనకొప్పు వెడ జారీ
పక్కన మగువ నీకుఁ బాదా లొత్తఁగా
నెక్కొనఁ గళలు దేరీ నివ్వెఱఁగు లుట్టిపడీ
అక్కర తో నిన్నుఁ జూచేయట్టి నిబ్బరానను

(॥॥)
చన్నులు గక్కదలీని సంధులు గడునడరీ
వన్నెల నీ కీపె యాలవట్ట మిడఁగా
నెన్నడుము నసి యాడీ నిట్టూర్పులును రేఁగీ
విన్నపాలు నీకుఁ జేసె వేడుకలను

(॥॥)
వేళ్ళ మట్టేలు వాగీ వెస మోవిందేనె చిందీ
కొల్లలుగా నిన్ను రతి గొసరఁగాను
అల్లదే శ్రీ వేంకటేశ హారములు నులిగొనీ
మెల్లనే నీతోఁ బెనఁగే మెలపునను

(||pallavi||)
sakkam̐ jūḍarādā iṁti jāḍalu nīvu
yĕkkaḍa leni yāsoda mĕṁta gaddo kāni

(||||)
sĕkkulam̐ jĕmaḍa gārī nenagŏppu vĕḍa jārī
pakkana maguva nīgum̐ bādā lŏttam̐gā
nĕkkŏnam̐ gaḽalu derī nivvĕṟam̐gu luṭṭibaḍī
akkara to ninnum̐ jūseyaṭṭi nibbarānanu

(||||)
sannulu gakkadalīni saṁdhulu gaḍunaḍarī
vannĕla nī kībĕ yālavaṭṭa miḍam̐gā
nĕnnaḍumu nasi yāḍī niṭṭūrbulunu rem̐gī
vinnabālu nīgum̐ jesĕ veḍugalanu

(||||)
veḽḽa maṭṭelu vāgī vĕsa moviṁdenĕ siṁdī
kŏllalugā ninnu radi gŏsaram̐gānu
allade śhrī veṁkaḍeśha hāramulu nuligŏnī
mĕllane nīdom̐ bĕnam̐ge mĕlabunanu