Sakkam gaa naanadeevayya sammadimchem gaani nenu

చక్కఁ గా నానతీవయ్య సమ్మతించేఁ గాని నేను
Language

(॥పల్లవి॥)
చక్కఁ గా నానతీవయ్య సమ్మతించేఁ గాని నేను
పిక్కటిల్లుఁ గోరికలు పెనగొనెనా

(॥॥)
యెలమి మీరిద్దరును యేకతాన నుండితిరి
చెలియ విన్నపములు చెవిఁ బట్టెనా
నలువంక మీలోనే నవ్వుకొంటా నుండితిరి
తలకొన్నవలపులు తారుకాణలాయనా

(॥॥)
పరగ నిద్దరు నుండి పందేలు వేసుకొంటిరి
తరుణీసరసము చిత్తమువచ్చెనా
మరుగుచు నొడఁబాటుమాట లాడుకొంటిరి
యెరవులేనిపొందు లియ్యకొంటిరా

(॥॥)
వేడుకతో నీవునాకె విడేలందుకొంటిరి
చేడెకు నీకాఁగిటిలో సిగ్గుదేరెనా
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యీడుతో నీననుపులు యిరవాయనా

(||pallavi||)
sakkam̐ gā nānadīvayya sammadiṁchem̐ gāni nenu
pikkaḍillum̐ gorigalu pĕnagŏnĕnā

(||||)
yĕlami mīriddarunu yegadāna nuṁḍidiri
sĕliya vinnabamulu sĕvim̐ baṭṭĕnā
naluvaṁka mīlone navvugŏṁṭā nuṁḍidiri
talagŏnnavalabulu tārugāṇalāyanā

(||||)
paraga niddaru nuṁḍi paṁdelu vesugŏṁṭiri
taruṇīsarasamu sittamuvachchĕnā
marugusu nŏḍam̐bāḍumāḍa lāḍugŏṁṭiri
yĕravulenibŏṁdu liyyagŏṁṭirā

(||||)
veḍugado nīvunāgĕ viḍelaṁdugŏṁṭiri
seḍĕgu nīgām̐giḍilo sigguderĕnā
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yīḍudo nīnanubulu yiravāyanā