(॥పల్లవి॥)
చక్కజాడనుండవే చలమేమౌనో
నిక్కకువే సారెసారె నిలువేమౌనో
(॥చక్క॥)
సెలవి నవ్వఁగఁబోతేఁ జెక్కులెల్లాఁ బులకించె
పలుకకువే ఇఁకఁ బంతమేమౌనో
తలవంచఁబోతేను తనువెల్లాఁ బులకించె
నెలసి చూడకువే సిగ్గులేమౌనో
(॥చక్క॥)
చేసన్న సేయఁబోతే చిత్త మెల్లా నీరాయ
పాసి యడుగిడుకువే పాయమేమౌనో
వాసికిఁ జంకించఁబోతే వాడఁబారె మొగమెల్లా
ఆసలఁ జింతించకువే అప్పటి నేమౌనో
(॥చక్క॥)
కాఁగిటఁ గూడఁగఁబోతే కందువ మరపులాయ
మూఁగి బుసకొట్టకువే మోనమేమౌనో
పాఁగినశ్రీవేంకటాద్రిపతినై ననను నీవు
వీఁగక రతిసేసితి వెనక నేమౌనో
(||pallavi||)
sakkajāḍanuṁḍave salamemauno
nikkaguve sārĕsārĕ niluvemauno
(||sakka||)
sĕlavi navvam̐gam̐bodem̐ jĕkkulĕllām̐ bulagiṁchĕ
palugaguve im̐kam̐ baṁtamemauno
talavaṁcham̐bodenu tanuvĕllām̐ bulagiṁchĕ
nĕlasi sūḍaguve siggulemauno
(||sakka||)
sesanna seyam̐bode sitta mĕllā nīrāya
pāsi yaḍugiḍuguve pāyamemauno
vāsigim̐ jaṁkiṁcham̐bode vāḍam̐bārĕ mŏgamĕllā
āsalam̐ jiṁtiṁchaguve appaḍi nemauno
(||sakka||)
kām̐giḍam̐ gūḍam̐gam̐bode kaṁduva marabulāya
mūm̐gi busagŏṭṭaguve monamemauno
pām̐ginaśhrīveṁkaḍādribadinai nananu nīvu
vīm̐gaga radisesidi vĕnaga nemauno