చక్క సాగిలి మొక్కేము చాలించరాదా
(॥పల్లవి॥)
చక్క సాగిలి మొక్కేము చాలించరాదా
మొక్కుకు మొక్కఁగఁబోతే ముగియ దెంతైనా
(॥చక్క॥)
మాటకు మాటలాడ మరి యంతేసి నేరవు
యేఁటికి మాతో వాదు లేల పెంచేవు
చీటికిమాటికి నట్టె చీలకుఁ జీల వెట్టితే
కోటానఁగోటీఁ జాలవు కొండమాకు లెల్లాను
(॥చక్క॥)
చెఁతకుఁ జేఁత సేయఁ జేరి యంతేసి నేరవు
యీఁతవలపులు మాపై నేల పెంచేవు
పూఁతకు బూఁత గోడ పుయ్యఁగఁ బుయ్యఁగ బోతే
బాఁతిపడి భూమెల్లాఁబట్టు నెంతైనాన
(॥చక్క॥)
నవ్వుకు నవ్వులు నవ్వ నాలి యెంతేసి నేరవు
ఇవ్వల నవ్వల మమ్ము నేల రేఁచేవు
రవ్వగా శ్రీ వేంకటేశ రతి నన్నుఁ గూడితివి
దివ్వెను దివ్వె ముట్టించితే దీపములే నిండును
(||pallavi||)
sakka sāgili mŏkkemu sāliṁcharādā
mŏkkugu mŏkkam̐gam̐bode mugiya dĕṁtainā
(||sakka||)
māḍagu māḍalāḍa mari yaṁtesi neravu
yem̐ṭigi mādo vādu lela pĕṁchevu
sīḍigimāḍigi naṭṭĕ sīlagum̐ jīla vĕṭṭide
koḍānam̐goḍīm̐ jālavu kŏṁḍamāgu lĕllānu
(||sakka||)
sĕm̐tagum̐ jem̐ta seyam̐ jeri yaṁtesi neravu
yīm̐tavalabulu mābai nela pĕṁchevu
pūm̐tagu būm̐ta goḍa puyyam̐gam̐ buyyam̐ga bode
bām̐tibaḍi bhūmĕllām̐baṭṭu nĕṁtaināna
(||sakka||)
navvugu navvulu navva nāli yĕṁtesi neravu
ivvala navvala mammu nela rem̐sevu
ravvagā śhrī veṁkaḍeśha radi nannum̐ gūḍidivi
divvĕnu divvĕ muṭṭiṁchide dībamule niṁḍunu