సకియకు నీకును సరి పంతంబులు
(॥పల్లవి॥)
సకియకు నీకును సరి పంతంబులు
ప్రకటంబాయ ప్రంహ్లా(ప్రహ్లా?)దవరద
(॥సకియ॥)
చిక్కనిచెమటల జీరులు వారఁగ
వుక్కుగుబ్బలను వొత్తీఁ జెలి
నిక్కి నీవురము నెలకొని వోర్చెను
చక్కని పెనువజ్రము గాఁబోలును
(॥సకియ॥)
కనుఁగవతళుకులు గడువాఁడి మిగుల
కొనచూపులనే కొచ్చీఁ జెలి
గొనకొని నీమేను గురియై నిలిచెను
అనిశము పఁసిడిలోహము గాఁబోలు
(॥సకియ॥)
తేనెల పెదవులతీపు నాముకొన
కానుకరతులనుఁ గప్పీఁ జెలి
ఆనుక శ్రీవేంకటాధిప నీగుండె
కోనల సంజీవికొండ గాఁబోలు
(||pallavi||)
sagiyagu nīgunu sari paṁtaṁbulu
pragaḍaṁbāya praṁhlā(prahlā?)davarada
(||sagiya||)
sikkanisĕmaḍala jīrulu vāram̐ga
vukkugubbalanu vŏttīm̐ jĕli
nikki nīvuramu nĕlagŏni vorsĕnu
sakkani pĕnuvajramu gām̐bolunu
(||sagiya||)
kanum̐gavadaḽugulu gaḍuvām̐ḍi migula
kŏnasūbulane kŏchchīm̐ jĕli
gŏnagŏni nīmenu guriyai nilisĕnu
aniśhamu pam̐siḍilohamu gām̐bolu
(||sagiya||)
tenĕla pĕdavuladību nāmugŏna
kānugaradulanum̐ gappīm̐ jĕli
ānuga śhrīveṁkaḍādhiba nīguṁḍĕ
konala saṁjīvigŏṁḍa gām̐bolu