సగము గర్వము నీకు సగము ప్రియము నాకు
(॥పల్లవి॥)
సగము గర్వము నీకు సగము ప్రియము నాకు
యెగసక్కెములు సేసే వేలే యిది
(॥సగము॥)
చెక్కునఁబెట్టినచేయి చేచేత నుండఁగాను
వొక్కచేతనే మొక్కేవు వొద్దే యిది
ముక్కునమోపినవేలు ముందరనే వుండఁగాను
గక్కున నవ్వు నవ్వేవు కాదే యిది
(॥సగము॥)
కన్నులఁ దొట్టిననిద్ర కన్నులనే వుండఁగాను
సన్నసేసి పిలిచేవు చాలునే యిది
చన్నులజారుఁబయ్యద జారినట్టే వుండఁగాను
చిన్ని తిట్లు దిట్టేవు చెల్లునే యిది
(॥సగము॥)
పానుపుమీఁదటిమేను పానుపుపై నుండఁగాను
ఆని నన్నుఁ గౌఁగిలించే వౌనే యిది
పైనే శ్రీవేంకటాదిపతినేఁ గూడితి నిన్ను
కాని కాని మనసుకంటెనే యిది
(||pallavi||)
sagamu garvamu nīgu sagamu priyamu nāgu
yĕgasakkĕmulu sese vele yidi
(||sagamu||)
sĕkkunam̐bĕṭṭinaseyi seseda nuṁḍam̐gānu
vŏkkasedane mŏkkevu vŏdde yidi
mukkunamobinavelu muṁdarane vuṁḍam̐gānu
gakkuna navvu navvevu kāde yidi
(||sagamu||)
kannulam̐ dŏṭṭinanidra kannulane vuṁḍam̐gānu
sannasesi pilisevu sālune yidi
sannulajārum̐bayyada jārinaṭṭe vuṁḍam̐gānu
sinni tiṭlu diṭṭevu sĕllune yidi
(||sagamu||)
pānubumīm̐daḍimenu pānububai nuṁḍam̐gānu
āni nannum̐ gaum̐giliṁche vaune yidi
paine śhrīveṁkaḍādibadinem̐ gūḍidi ninnu
kāni kāni manasugaṁṭĕne yidi